Sanitary Napkins: శానిటరీ న్యాప్‌కిన్లు ఏర్పాటు చేయండి.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరిన లా విద్యార్థిని

హైకోర్టు పరిధిలో శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేకపోవడంతో అసౌకర్యానికి గురైన ఒక యువ లాయర్.. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. కోర్టు పరిధిలో శానిటరీ న్యాప్‌కిన్లు ఏర్పాటు చేసేలా చూడాలని కోరింది.

Sanitary Napkins: శానిటరీ న్యాప్‌కిన్లు ఏర్పాటు చేయండి.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరిన లా విద్యార్థిని

Sanitary Napkins: ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో శానిటరీ న్యాప్‌కిన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఒక లా స్టూడెంట్ (ఇంటర్న్) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. హైకోర్టు పరిధిలో శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేవనే విషయాన్ని ఆమె ప్రస్తావించింది.

Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ప్రకారం.. ఆ యువతి ఒక సీనియర్ న్యాయవాది వద్ద ఇంటర్న్‌గా చేస్తోంది. ఈ నెల 1 నుంచి ఆ లాయర్‌తోపాటు, ఢిల్లీ హైకోర్టులో విధులకు హాజరవుతోంది. అయితే, ఇటీవల ఆమెకు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు శానిటరీ న్యాప్‌కిన్ అవసరమైంది. దీనికోసం ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి, కోర్టు మెడికల్ డిస్పెన్సరీలో అడిగింది. అయితే, అక్కడ శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేవని ఫార్మాసిస్ట్ సమాధానం ఇచ్చింది. న్యాప్‌కిన్లు కావాలంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు వెళ్లమని ఫార్మాసిస్ట్ సూచించింది. దీంతో యువ లాయర్ అక్కడికి కూడా వెళ్లి అడిగింది. కానీ, అక్కడ కూడా శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేవు. దీంతో తాను చాలా ఇబ్బందికి గురైనట్లు ఆమె లేఖలో పేర్కొంది.

Lehenga Buttons: మామూలు తెలివి కాదు.. లెహెంగా బటన్స్‌లో 41 లక్షల క్యాష్.. పట్టుకున్న అధికారులు

అందువల్ల హై కోర్టు పరిధిలోని డిస్పెన్సరీలో లేదా వెండింగ్ మెషీన్లలో లేదా మరేదైనా మార్గంలో శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని లేఖలో కోరింది. నిజానికి 2018లో హైకోర్టు పరిధిలో శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో ఉండేలా వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. కానీ, అవి ప్రస్తుతం అందుబాటులో లేవు.