NEET PG 2021: నీట్ ఎగ్జామ్ నాలుగు నెలలు వాయిదా

NEET  PG 2021: నీట్ ఎగ్జామ్ నాలుగు నెలలు వాయిదా

Neet Pg 2021 Exam Postponed For 4 Months

NEET EXAM కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా నీట్ పీజీ ఎగ్జామ్ ను మరోసారి వాయిదా వేసింది.

కరోనా రెండో దశ ఉదృతి నేపథ్యంలో.. MBBS,BDS కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష-2021ని నాలుగు నెలలపాటు వాయిదావేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, దేశంలో రోజుకు 4 లక్షల కొత్త కేసులతో కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఎంబీబీఎస్‌, నర్సింగ్ కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులను కోవిడ్‌ సేవల్లో వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రస్తుతం కరోనా డిమాండ్‌కు తగినట్లుగా వైద్య సిబ్బంది లేకపోవడంతో వీరి సేవల్ని వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణులైన నర్సింగ్ విద్యార్థులను కూడా కోవిడ్ డ్యూటీలో వాడుకోవాలని నిర్ణయించింది. కోవిడ్ విధుల్లో పాల్గొనే వైద్య విద్యార్థులకు బీమా పథకం వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. 100 రోజులుకోవిడ్ విధులు పూర్తి చేసిన వైద్య సిబ్బందికి రాబోయే సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. వీరికి ప్రధానమంత్రి విశిష్ఠ జాతీయ సేవల పురస్కారం ఇస్తామని కేంద్రం తెలిపింది.