Covid Third Wave : భారత్ లోకి అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్..పిల్లలపై ఎక్కువ ప్రభావం

భారత్ లో అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీ హెచ్చరించింది. ప్రధాని కార్యాలయానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.

Covid Third Wave : భారత్ లోకి అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్..పిల్లలపై ఎక్కువ ప్రభావం

India

covid third wave hit India : ప్రపంచ దేశాలను కరోనా గజ గజ వణికిస్తోంది. తన రూపాలను మార్చుకుంటూ దాడి చేస్తోంది. భారత్ ను ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు భారత్ కు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచివుంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలనిపిస్తోంది. భారత్ లోకి అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎమ్) నిపుణుల కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ధానమంత్రి కార్యాలయానికి ఎన్‌ఐడిఎమ్ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.

థర్ద్ వేవ్ తో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణుల కమిటి హెచ్చరించింది. మెరుగైన వైద్య సంసిద్ధత కోసం సన్నద్ధం కావాలని కేంద్రానికి సూచనలు చేసింది. పిల్లలకు వైద్య సౌకర్యాలు – వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు, వైద్య పరికరాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవని నివేదికలో పేర్కొంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 82% శిశువైద్యుల కొరత ఉందని నిపుణుల కమిటీ తెలిపింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63% ఖాళీలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొన్న డేటా గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే కోవిడ్ పరిస్థితి భయంకరంగా ఉంది, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, తగినంత వైద్య సదుపాయాలు, వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చని కేంద్రానికి ప్రధాని కార్యాలయానికి పంపిన నివేదికలో పేర్కొంది.

ఎన్‌ఐడిఎమ్ నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్న CSIR-IGIB డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్, ఎయిమ్స్ మాజీ డైరక్టర్ ఎంసీ మిశ్రా, భారతీయ శిశువైద్యుల సంఘం అధ్యక్షుడు నవీన్ ఠాకర్, ప్రొఫెసర్ గగన్ దీప్ కాంగ్, పట్టణ నిరాశ్రయులకు ఆశ్రయంపై రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎకె పాండే ఉన్నారు.