బంగారు డాలర్.. సొంత రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన నిత్యానంద

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 01:12 PM IST
బంగారు డాలర్.. సొంత రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన నిత్యానంద

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు..పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన దేశంగా ప్రకటించుకున్న ఈ స్వామి ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు.



2020, ఆగస్టు 22వ తేదీ వినాయక చవితి రోజున ప్రారంభిస్తానని చెప్పినట్లుగానే..చేశారు. కైలాస దేశానికి చెందిన నాణేలను కూడా విడుదల చేయడం విశేషం. ఆర్బీకే నాణేలు బంగారంతో చేసినవంటూ..ఆయన చెప్పారు.

కైలాస దేశం కరెన్సీ అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఓ దేశంతో చట్టబద్దంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కానీ ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నారో ప్రకటించలేదు.



మూడు రోజుల క్రితం నిత్యానంద ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రిజర్వ్ బ్యాంకు ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. గణపతి దయతో కైలాస రిజర్వ్ బ్యాంకును ప్రారంభించనున్నట్లు ఆ వీడియోలో తెలిపారు.

రిజర్వ్ బ్యాంకు కోసం ఆర్థిక విధానం పేరిట 300 పేజీల నోట్ సిద్ధం చేసినట్లు, వాటికన్ బ్యాంకు తరహాలో నిర్మాణాత్మకంగా ఉంటుందన్నారు.



కైలాస అనేది నిత్యానంద పెట్టుకున్న దేశం పేరు. స్వయంగా తానే ప్రధాన మంత్రి అంటూ ప్రకటించుకున్నారు. భారతదేశంలో నమోదైన పలు కేసుల్లో ఇతను పారిపోయాడు. కానీ అతను ప్రకటించుకున్న దేశం ఎక్కడుందో తెలియదు. అయితే..ఈక్వెడార్ తీరంలో నిత్యానంద కొనుగోలు చేసిన ఓ ద్వీపంలో ఉందని ప్రచారం జరుగుతోంది.

అధికారిక వెబ్ సైట్ కూడా రూపొందించారు. హిందూ మతాన్ని పాటించకపోతున్న వారి కోసమే కైలాసను స్థాపించడం జరిగిందని నిత్యానంద వెల్లడించారు.



https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4256315081122976