బీజీపీలో కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 06:53 AM IST
బీజీపీలో కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్

రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
శివసేన పార్టీకి చెందిన సామ్నా న్యూస్ పేపర్ కు ఎడిటర్ గా ఉన్న సంజయ్ రౌత్ ఆదివారం సామ్నా ఓ కథనం రాశారు. ఆ కథనం ప్రకారం.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతుందని, ప్రధాని మోడీ పలుకుబడి మాత్రం తగ్గుతుందని తెలిపారు. రాబోయో ఎన్నికల్లో ఎన్డీయేకు పూర్తి మొజారిటీ రాదని, దానికి నరేంద్రమోడీదే భాధ్యత అని అన్నారు.

2014లో మోడీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారని, అయితే అవకాశం దుర్వినియోగం చేయబడిందన్నారు. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని రౌత్ అన్నారు. రాహుల్ నాయకత్వం మోడీ స్థాయిలో లేదు కానీ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, దీంతో రాహుల్ కి ఇంపార్టెన్స్ పెరిగిందని అన్నారు. రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్న సమయంలో నితిన్ గడ్కరీ స్టేట్ మెంట్ లు వారికి కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. నితిన్ గడ్కరీకి బీజేపీ నేతలతో పాటు ఆరెస్సెసె మద్దతు కూడా ఉండటం గడ్కరీకి కలిసివచ్చే అంశం. రాజకీయ కుట్రల కారణంగానే గడ్కరీ రెండో టర్మ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టలేకపోయినట్లు సంజయ్ రౌత్ తెలిపారు. రాబోయో ఎన్నికల్లో హంగ్ పరిస్థితి కోసం గడ్కరీ ఎదురుచూస్తున్నారని రౌత్. గడ్కరీ పధాని అయ్యే అవకాశముందని తెలిపారు.

అయితే బీజేపీలో కూడా గడ్కరీ రూపంలో ఓ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఉండబోతున్నారంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ హంగ్ వస్తే గడ్కరీ ప్రధాని అవుతారన్న ఇప్పుడు దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తుంది. ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా 2050నాటికి ఒకరి కన్నా ఎక్కువ మంది మరాఠీలు ప్రధాన మంత్రి పదవి చేపడతారని అన్నారు. గడ్కరీని దృష్టిలో పెట్టుకొని ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలువురు చర్చించుకొంటున్నారు.