Delhi: ఉద్యోగాలపై ప్రభావం ఉండదు.. ఢిల్లీలో నో లాక్‌డౌన్ – కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

Delhi: ఉద్యోగాలపై ప్రభావం ఉండదు.. ఢిల్లీలో నో లాక్‌డౌన్ – కేజ్రీవాల్

Arvind Kejriwal

Delhi: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ‘ఢిల్లీ వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఎవరూ ఏం మాట్లాడటం లేదు. పాజిటివిటీ రేటు 25శాతం పెరిగింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని వివరించారు.

సిటీలో లాక్‌డౌన్ ఉండబోదని అదే సమయంలో పబ్లిక్ ను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని సూచించారు సీఎం. ప్రస్తుత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని చెప్పారు.

‘అమలు చేస్తున్న ఆంక్షలన్నింటినీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తీసేస్తాం. ప్రస్తుతం హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఇప్పుడు ఆక్సిజన్ చాలా తక్కువ మందికి మాత్రమే అవసరం అవుతుంది. అదనంగా 37వేల బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముందస్తు జాగ్రత్తగా ఐసీయూ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నా’మని ఢిల్లీ సీఎం అన్నారు.

ఇది కూడా చదవండి: లోన్ ఇవ్వలేదని బ్యాంకుకు నిప్పు పెట్టిన యువకుడు