Bitcoin: బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించేది లేదు – నిర్మలా సీతారామన్

దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించట్లేదని...

Bitcoin: బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించేది లేదు – నిర్మలా సీతారామన్

Bitcoin

Bitcoin: దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించట్లేదని ఆమె హౌస్‌లో వెల్లడించింది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ.. రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలోనే సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ప్రభుత్వం.

ఒకవైపు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ను భారత ప్రభుత్వం నిషేధించబోతోందని చర్చ జరుగుతుండానే.. మరోవైపు సింగపూర్-బెస్ట్ వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఎక్స్‌చేంజ్ పేరు కాయిన్‌స్టోర్ తన వెబ్, అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

…………………………. : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ

బెంగళూరు, న్యూఢిల్లీ , ముంబైలలో కొన్ని శాఖలను తెరవాలని యోచిస్తోంది. భారతదేశంలో 100 మందికి పైగా ఉద్యోగులు ఉండేలా కాయిన్‌స్టోర్ సిద్ధమవుతోందని చార్లెస్ టాన్ చెప్పారు.