AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ

సంవత్సరం కిందట.. ఏపీలో ఓ రేంజ్‌లో చర్చకు దారితీసింది కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం. ఆ తర్వాత.. ఈ ఇష్యూకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ.. ఇప్పుడు దీనిమీద చర్చ మొదలైంది.

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ

Ap Govt

debate on New Districts in AP : ఉన్నట్టుండి.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ మొదలైంది. ఏడాది కిందట.. ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. ఆ తర్వాత.. రకరకాల కారణాలతో.. ఈ అంశాన్ని పక్కనబెట్టేశారు. మరి.. సడన్‌గా ఈ టాపిక్ ఇప్పుడెందుకొచ్చింది? కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే.. ఎన్ని చేస్తారు? ఏ జిల్లాలను ఎలా విడగొడతారు…?

సంవత్సరం కిందట.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రేంజ్‌లో చర్చకు దారితీసింది కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం. ఆ తర్వాత.. ఈ ఇష్యూకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ.. ఇప్పుడు దీనిమీద చర్చ మొదలైంది. ఇందుకు.. వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్సే కారణం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో.. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. కేంద్రం నుంచి ఇంకొన్ని నిధులు వస్తాయన్న చర్చ జరిగింది. ఆ దిశగా చర్యలు సైతం తీసుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పడంతో.. ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

Tirupati : తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం

గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావాలని.. సీఎంవో ఆదేశాలిచ్చింది. దీంతో.. అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. కానీ.. తదుపరి ఆదేశాలు రాకపోవడంతో.. రెవెన్యూ శాఖ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలను తాత్కాలికంగా పక్కనబెట్టేశారు. అప్పట్లో.. ఏపీలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు. ఆ లెక్కన రాష్ట్రంలో 25 గానీ, 26 గానీ జిల్లాలు ఏర్పాటవుతాయని.. గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల వరుస సమావేశాలు హడావుడిగా జరిగాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలను సేకరించి.. పరిశీలించారు అధికారులు. లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు, ఇతర వివరాలను సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో.. పోలీసు జిల్లా కార్యాలయాల కోసం భవనాలు, స్థలాల సేకరణ, సిబ్బంది కేటాయింపు, ఇతర అంశాలపై పోలీసు శాఖ కూడా కొంత కసరత్తు చేసింది. తర్వాత.. వీటన్నింటిని తాత్కాలికంగా పక్కనపెట్టేశారు.

Lok Sabha : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభ ఆమోదం

రాష్ట్రంలో ప్రస్తుతం.. 13 జిల్లాలున్నాయి. ఇందులో.. జిల్లా కేంద్రం కానున్న పట్టణానికి మిగిలిన నియోజకవర్గ కేంద్రాల నుంచి దూరం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో వివరాలను సిద్ధం చేశారు. లోక్‌సభ స్థానాలను ప్రామాణికంగా తీసుకుంటే.. ఏపీలో కొత్త జిల్లాలు 25కు పెరుగుతాయి. అరకు ఎంపీ నియోజకవర్గ విస్తీర్ణం పెద్దగా ఉండటంతో.. దీనిని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు.. దేశంలో జనగణన పూర్తయ్యే దాకా ఏ రాష్ట్రంలోనూ.. భౌగోళిక సరిహద్దులను మార్చేందుకు వీల్లేదని ఈ ఏడాది మార్చిలో భారత రిజిస్ట్రార్ ఆఫీస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎంపీల దగ్గర ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.