ఓట్లు వేయకపోతే నీళ్లు, కరెంట్ కట్ చేస్తానని బెదిరిస్తోన్న మంత్రి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే పరిస్థితులను ఎదుర్కోలేరంటూ బెదిరిస్తున్నారు వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ మినిష్టర్ తపన్ దాస్‌గుప్తా. హుగ్లీలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో.. సప్తగ్రామ్ అసెంబ్లీ టీఎంసీ అభ్యర్థి ఓటర్లపై బెదిరింపులకు

ఓట్లు వేయకపోతే నీళ్లు, కరెంట్ కట్ చేస్తానని బెదిరిస్తోన్న మంత్రి

No votes – no water & electricity: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే పరిస్థితులను ఎదుర్కోలేరంటూ బెదిరిస్తున్నారు వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ మినిష్టర్ తపన్ దాస్‌గుప్తా. హుగ్లీలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో.. సప్తగ్రామ్ అసెంబ్లీ టీఎంసీ అభ్యర్థి ఓటర్లపై బెదిరింపులకు దిగారు. ఎవరైతే ఓటర్లు తనకు ఓటు వేయకుండా ఉంటారో ఆ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ, నీరు అందుకోలేరని చెప్పారు.

‘ఏయే ప్రాంతాల్లోనైతే ఓట్లు అందవో.. వారికి వాటర్, కరెంట్ అందవు. ఇది సింపుల్. వీటి కోసం మళ్లీ బీజేపీని అడగాలి’ అని శనివారం జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హుగ్లీలోని సప్తగ్రామ్ ఎమ్మెల్యే తపన్ దాస్ గుప్తా 2011లోనే అధికారంలోకి వచ్చారు. 2016బెంగాల్ ఎన్నికల్లోనూ.. గెలిచి సప్తగ్రామ్ సీట్ దక్కించుకున్నాడు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మరోసారి అదే సీట్ ను దాస్ గుప్తాకు ఇవ్వాలని నిర్ణయించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ఓట్ల కోసం బెదిరింపులకు దిగడం తొలిసారేం కాదు. హమీదుల్ రెహమాన్ అనే వ్యక్తి ఓటర్లను బెదిరిస్తున్న వీడియో ఒకటి కెమెరాలో రికార్డు అయింది.

ద్రోహులు ఎవరైన ఉంటే ఎన్నికలైపోయాక వారికి శిక్ష తప్పదు. అని దీనజ్ పూర్ కు చెందిన హమీదుల్ రెహమాన్ దీనపై పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. సీఎం మమతాబెనర్జీ ప్రవేశపెట్టిన స్కీంలు అందుకుంటున్న వారంతా ఓట్లు వేయాలి. అందుకోని వాళ్లు కూడా ఓటు వేయాలి. అది టీఎంసీ, సీపీఎం, బీజేపీ ఎవరైనా సరే ఎలాంటి వారైన ఓటు వేయాల్సిందే కదా.