బర్త్‌డే పార్టీ.. ప్రీ వెడ్డింగ్‌.. ఏ వేడుకలైనా మెట్రో రైలులోనే

యూపీలోని నోయిడా మెట్రో వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతోపాటు డబ్బులు రాబట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 04:08 AM IST
బర్త్‌డే పార్టీ.. ప్రీ వెడ్డింగ్‌.. ఏ వేడుకలైనా మెట్రో రైలులోనే

యూపీలోని నోయిడా మెట్రో వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతోపాటు డబ్బులు రాబట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

యూపీలోని నోయిడా మెట్రో వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతోపాటు డబ్బులు రాబట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. బర్త్‌డే పార్టీ, ప్రీ వెడ్డింగ్‌.. ఇలాంటి కార్యక్రమాలేవైనా మెట్రో రైలులోనే జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. గౌతమబుద్ధ నగర్‌ జిల్లాలోని జంట నగరాల మధ్య సేవలందిస్తున్న నోయిడా మెట్రో.. ఇప్పటికే స్టేషన్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు, ఫొటోగ్రఫీలను అనుమతిస్తోంది. తాజాగా మెట్రో రైళ్లలో పుట్టినరోజు వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకొనే వెసులుబాటును కూడా కల్పించనున్నట్లు నోయిడా మెట్రో రైలు కార్పొరేషన్‌ గురువారం (ఫిబ్రవరి 13, 2020) విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఆసక్తి కలిగిన వారు ఒకటి లేదా రెండు కోచ్‌లు.. గరిష్ఠంగా నాలుగు కోచ్‌ల వరకు బుక్‌ చేసుకోవచ్చని మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది. 15 రోజుల ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మొదట బుక్‌ చేసుకున్నవారికి తొలుత సేవలందించే ప్రాతిపదికన పని చేస్తామని ఎన్‌ఎంఆర్‌సీ వెల్లడించింది. కోచ్‌ను బుకింగ్‌ చేసుకున్నప్పుడు లైసెన్స్‌ రుసుం కింద గంటకు రూ.5000 నుంచి రూ.10000 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 

వీటిలో డెకరేషన్‌, నాన్‌ డెకరేషన్‌, రన్నింగ్‌ మెట్రో, నాన్‌ రన్నింగ్‌ మెట్రో రైలు.. ఇలా ఎంచుకున్న దాన్ని బట్టి ధరలు ఉంటాయని పేర్కొంది. కార్యక్రమం ఏదైనా ఒక్కో కోచ్‌కు 50 మందిని మాత్రమే (పెద్దలు + చిన్నారులు) అనుమతించనున్నట్టు సంస్థ తెలిపింది.