నిజాయితీకి బహుమానం : రూ.20 కటింగ్‌కు రూ.28వేలు ఇచ్చాడు

అహ్మదాబాద్ : ఈ రోజుల్లో నిజాయితీపరులు ఉండటం చాలా కష్టం. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న రోజులివి. కాసుల కోసం సొంతవారి ప్రాణాలు తీసే మనుషులు

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 11:25 AM IST
నిజాయితీకి బహుమానం : రూ.20 కటింగ్‌కు రూ.28వేలు ఇచ్చాడు

అహ్మదాబాద్ : ఈ రోజుల్లో నిజాయితీపరులు ఉండటం చాలా కష్టం. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న రోజులివి. కాసుల కోసం సొంతవారి ప్రాణాలు తీసే మనుషులు

అహ్మదాబాద్ : ఈ రోజుల్లో నిజాయితీపరులు ఉండటం చాలా కష్టం. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న రోజులివి. కాసుల కోసం సొంతవారి ప్రాణాలు తీసే మనుషులు ఉన్నారు. ఇక  విదేశీయులను మోసం చేసేవారికి కొదవే లేదు. అలాంటి ఈ రోజుల్లోనూ ఆ వ్యక్తి నిజాయితీగా వ్యవహరించాడు. పేదరికంలో ఉన్నా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా నీతిని మాత్రం కోల్పోలేదు.  అదే అతడికి వరంగా మారింది. 28వేల రూపాయలు సంపాదించేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. రోడ్డు పక్కన కటింగ్ చేసే అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 28వేల రూపాయలు సంపాదించాడు. అతడు చూపిన నిజాయితీనే ఆ బహుమతి పొందడానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

హెరాల్డ్ బాల్డర్.. నార్వేకి చెందిన ఇతడు ప్రముఖ యూట్యూబర్‌గా పాపులర్ అయ్యాడు. దేశ విదేశాలు తిరుగుతూ వీడియోలు తీస్తూ వాటిని అప్‌లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో హెరాల్డ్ ఈసారి  భారత్ టూర్‌కు వచ్చాడు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్నాడు. హెయిర్ కటింగ్ చేయించుకోవాలని హెరాల్డ్‌కి అనిపించింది. అతడు అనుకుంటే ఏదైనా ఖరీదైన సెలూన్‌కి వెళ్లి  కటింగ్ చేయించుకోగలడు. కానీ రోడ్డు పక్కన సాదాసీదాగా ఉన్న సెలూన్‌కి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు.

 

తొందరగా ట్రిమ్ చేయమని చెప్పిన హెరాల్డ్.. అతడి పర్మిషన్ తీసుకుని కటింగ్ చేసే విధానాన్ని షూట్ చేశాడు. బిజినెస్ ఎలా జరుగుతుంది, రోజుకు ఎంతమంది కస్టమర్లు వస్తారు, ఎంత సంపాదిస్తాడు, ఫుట్‌పాత్ మీద వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎవరికైనా డబ్బు చెల్లించాలా అని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే కటింగ్ అయిన తర్వాత సెలూన్‌ నడిపే వ్యక్తితో సెల్ఫీలు కూడా దిగాడు. ఇక చివర్లో తాను ఫారినర్ కనుక తనను మోసం చేసేందుకు ఆ సెలూన్ వ్యక్తి ప్రయత్నిస్తాడని, తన దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకుంటాడేమోనని హెరాల్డ్  భావించాడు.

 

కానీ ఆ హెయిర్‌ డ్రెస్సర్‌ మాత్రం కేవలం రూ.20 మాత్రమే అడిగాడు. అందరికి ఛార్జ్ చేసినట్టే హెరాల్డ్‌కి కూడా చార్జ్ చేశాడు. దీంతో హెరాల్డ్ ఆశ్చర్యపోయాడు. తన గెస్ రాంగ్ కావడంతో  స్టన్నయ్యాడు. ఆ హెయిర్ డ్రెస్సర్ నిజాయితీకి ఫిదా అయ్యాడు. పేదరికంలో ఉన్నా నీతి తప్పని అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాదు తన పాకెట్ నుంచి 400 డాలర్లు(28వేల  రూపాయలు) తీసి ఆ హెయిర్ డ్రెస్సర్‌కి కానుకగా ఇచ్చాడు. ఆ డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కోమని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు.

 

తన జర్నీలో ఎందరినో కలిశానని, కానీ.. ఇలాంటి నిజాయితీపరుడిని చూడలేదని, అందుకే ఆ మంచి వ్యక్తికి అదనంగా బహుమతి ఇచ్చాను అని హెరాల్డ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్  మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆ హెయిర్ డ్రెస్సర్ నిజాయితీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు మనుషుల్లో మార్పు తెస్తాయని, మంచి దారిలో నడిచేలా ఇన్‌స్పైర్ చేస్తాయని చెబుతున్నారు.

Also Read: దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

Also Read: గడియారాల గొడవ : ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు