NSA నీడలో ఢిల్లీ : జాతీయ భద్రత చట్టం..గరిష్టంగా 12 నెలల తరబడి నిర్భందం

దేశ రాజధాని ఢిల్లీలో NSA మెయిన్ టాపిక్ అయ్యింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ నీడలో ఉండబోతున్నట్లు ఆదేశాలు జారీ చేశాయి. దీని ప్రకారం ఏ ఆందోళనకారుడు రోడ్డెక్కినా..పోలీసులు ఈ చట్టాన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. జాతీయ భద్రతా చట్టం ప్రకారం అదుపులోకి తీసుకునే అధికారాన్ని పోలీసు కమిషనర్‌కు ఇచ్చారు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ ఎత్తివేత, కాశ్మీర్ విభజన సమయంలో..జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NCR)లకు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. JNUలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గుర్తు తెలియని దండగులు క్యాంపస్‌లోకి చొరబడి అధ్యాపకులను, విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ సమయంలో ఈ చట్టం ముందుకు తీసుకరావడం గమనార్హం.
* జాతీయ భద్రతకు, శాంతిభద్రతలకు ముప్పు అని అధికారులు భావిస్తే ఆ వ్యక్తిని నెలల తరబడి నిర్భందించే అవకాశం ఉంది.
* ఈ చట్టం ప్రకారం 12 నెలల పాటు నిర్భందంలో ఉంచొచ్చని సమాచారం.
* 24 గంటల్లో కోర్టులో హాజరు పరచడం, అరెస్టు వాని ప్రాథమిక హక్కులను ఈ చట్టం తిరస్కరిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
* NSA కింద అరెస్టు చేస్తే కారణం చెప్పాల్సిన పనిలేదు.
* FIR లేకుండానే నిర్భందంలోకి తీసుకొనే ఛాన్స్.
* ఎంతమందిని అరెస్టు, నిర్భందంలోకి తీసుకున్నారో అధికారికంగా లెక్కలు ఉండవు.
* పోలీసులను దూషించినా, వారిపై దాడులకు దిగినా, వారి విధులకు ఆటంకం కలిగించినా..అరెస్టు చేయవచ్చు.
* కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు NSA అమలు చేశారంటున్నారు.
Read More : బిచ్చమెత్తుకుంటున్న ఇంజనీర్..షాక్ తిన్న పోలీసులు