Supreme court..YouTube : యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూడటంవల్లే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా..పరిహారం ఇప్పించాలంటూ సుప్రీంకోర్టుకెక్కిన యువకుడు..

యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూడటంవల్లే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా..గూగుల్ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ ఓ యువకుడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై విచారించిన కోర్టు..

Supreme court..YouTube : యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూడటంవల్లే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా..పరిహారం ఇప్పించాలంటూ సుప్రీంకోర్టుకెక్కిన యువకుడు..

Supreme court..YouTube

supreme court..YouTube : యూట్యూబ్‌లో అశ్లీల ప్రకటనలు చూడటం వల్లే తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని దీనికి పరిహారంగా ఇప్పించాలని కోరుతో ఓ యువకుడు సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. తాను పోలీసు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని ఈక్రమంలో తాను యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్ చూడటం వల్ల తాను పరీక్షలపై ఏకాగ్రత చూపించలేకపోయానని దీనికి కారణం గూగుల్ ఇండియా నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ మధ్యప్రదేశ్ కు చెందిన కిషోర్ చౌదరి అనే యువకుడు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అంతేకాదు ఇటువంటి కంటెంట్ ఉన్న యూట్యూబ్ కు నోటీసులు ఇవ్వాలని ఇటువంటి కంటెంట్ న నిషేధించాలని కోరాడు తన పిటీషన్ లో.

సదరు పిటీషన్ పరిశీలించిన ధర్మాసనం యువకుడి షాక్ ఇచ్చింది. ఎవరు చూడమన్నారు? పరీక్షలు ఉన్నాయి చదువుకోవాలనే విచక్షణ మరిచి అవిచూశాను ఇవి చూశాను అంటూ కుంటిసాకులు చెబుతున్న నీకు పరిహారం ఇప్పించాలా? నీలాంటివారి వల్లే కోర్టు విలువైన సమయం వృథా అవుతోంది అంటూ సుప్రీంకోర్టు సదరు యువకుడికి తిరిగి రూ.లక్ష జరిమానా విధించింది.దీంతో సదరు యువకుడు లబోదిబోమన్నాడు. నాకు అన్ని డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి. నేను నిరుద్యోగిని పోలీసు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను…నేను అంత జరిమానా కట్టలేను అంటూ లబోదిబోమన్నాడు. దీంతో కోర్టు రూ.లక్ష జరిమానాని రూ.25వేలకు తగ్గించింది. దీంతో లేనిపోనిది కెలుక్కుని జరిమానా కట్టాల్సి వచ్చిందంటూ నోరు మూసుకుని జరిమానా కడతానని చెప్పాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ..ఇంటర్నెట్ ప్రకటనలు చూసి పోటీ పరీక్షల్లో విఫలం కావడం ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అసలు ఆ ప్రకటనలను ఎవరు చూడమన్నారు? పైగా బాధ్యాతాయుతమైన పోలీసు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెబుతున్నావు..అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకంటే ఘోరమైన పిటిషన్ మరోటి ఉండదని మండిపడుతూ పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో సదరు యువకుడికి దిమ్మతిరిగిపోయింది. నేను నిరుద్యోగిని.. అంత జరిమానా చెల్లించలేను అంటూ కోర్టును ప్రాధేయ పడ్డాడు. దీంతో కోర్టు లక్ష రూపాయల జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది.

దీంతో సదరు యువకుడు నా తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటుంటారు. తాను కష్టపడి పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. కానీ యూట్యూబ్ లో వచ్చే అశ్లీల కంటెంట్ కు ఎడిట్ అయ్యాను..దీంతో నేను పరీక్షలకు సరిగా చదువుకోలేకపోయాను..కానీ ఇటువంటి కంటెంట్ తనలాంటి యువతను తప్పుదోవ పట్టిస్తోంది..జీవితాలు నాశనం చేస్తోంది. దయచేసి ఇటువంటివాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కోర్టును విన్నవించుకుంటూ క్షమాపణలు చెప్పాడు.