Marriage In Jail : పంతం నెగ్గించుకున్న ప్రియురాలు.. ప్రియుడిని అరెస్ట్ చేయించి మరీ జైల్లోనే పెళ్లి చేసుకుంది

ఓ ప్రియురాలు తన పంతం నెగ్గించుకుంది. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. ఇందుకోసం అతడిని అరెస్ట్ కూడా చేయించింది. ఆ తర్వాత జైల్లోనే అతడితో మూడుముళ్లు వేయించుకుంది.

Marriage In Jail : పంతం నెగ్గించుకున్న ప్రియురాలు.. ప్రియుడిని అరెస్ట్ చేయించి మరీ జైల్లోనే పెళ్లి చేసుకుంది

Odisha Youth Tied The Knot In Jail

Odisha youth tied the knot in jail : ఓ ప్రియురాలు తన పంతం నెగ్గించుకుంది. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. ఇందుకోసం అతడిని అరెస్ట్ కూడా చేయించింది. ఆ తర్వాత జైల్లోనే అతడితో మూడుముళ్లు వేయించుకుంది.

మరో అమ్మాయితో వివాహానికి ఏర్పాట్లు:
ఒడిశా రాష్ట్రంలోని కటక్‌ జిల్లా సదర్‌ స్టేషన్‌ సొంఖొతొరాస్‌ గ్రామానికి చెందిన నృసింహదాస్, పూజాదాస్‌ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియుడి తల్లిదండ్రులకు వీరి ప్రేమపెళ్లి ఇష్టం లేదు. దీంతో నృసింహదాస్‌కు మరో అమ్మాయితో వివాహం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2019 సెప్టెంబర్‌ 28న నృసింహదాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు నృసింహదాస్‌ ను జైలుకి పంపారు. అప్పటినుంచి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

దిగివచ్చిన ప్రేమికుడి కుటుంబసభ్యులు:
కాగా, నృసింహ దాస్‌ కుటుంబసభ్యులు దిగివచ్చారు. తమ కొడుకు పెళ్లి పూజాదాస్‌తో చేసేందుకు అంగీకరించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజాదాస్ కుటుంసభ్యులను సంప్రదించారు. ఇరు కుటుంబాల అభిప్రాయాన్ని గ్రామ పెద్దలు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన కోర్టు జైలు ప్రాంగణంలో ప్రేమికుల వివాహం జరిపించేందుకు అనుమతించింది. దీంతో ఉద్ధార్‌ స్వచ్చంద సంస్థ ఈ వివాహానికి ఏర్పాట్లు చేసింది. కటక్‌ జిల్లా చౌద్వార్‌ మండల జైలు ప్రాంగణంలో సంప్రదాయ రీతిలో శుక్రవారం(మార్చి 19,2021) పెళ్లి జరిగింది.

వరుడు జైలుకి, వధువు అత్తారింటికి:
దీంతో ఖైదీ నృసింహ దాస్, ప్రియురాలు పూజాదాస్‌ ఒక్కటయ్యారు. వారి పెళ్లికి జైలు అధికారులు ఉద్ధార్‌ స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత ఖైదీ నృసింహ దాస్‌ అత్తారింటికి(అదేనండి కారాగారానికి) వెళ్లగా, పెళ్లి కూతురు మెట్టినింటికి వెళ్లింది. ఈ కేసులో తదుపరి విచారణలో ఖైదీ నృసింహ దాస్‌ను కోర్టు విడుదల చేయొచ్చని ఇరు కుటుంబాల సభ్యులు ఆశిస్తున్నారు.