Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
మత మార్పిడి చేసుకోవాలంటూ ప్రియుడు వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.

Love Jihad in Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరోమారు లవ్ జిహాద్ ఘటన కలకలం రేపింది. మత మార్పిడి చేసుకోవాలంటూ ప్రియుడు వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, స్థానిక మీడియా కధనం ప్రకారం.. ఉడుపి జిల్లా కుందాపూర్ పట్టణ సమీపంలోని ఉప్పినకుడ్రు గ్రామానికి చెందిన..శిల్పా దేవాడిగ(25) అనే యువతి..స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుండేది. ఈక్రమంలో మూడేళ్ళ క్రితం అజిజ్ అనే యువకుడు శిల్పతో పరిచయం పెంచుకుని, ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. అజిజ్ మాటలు నమ్మిన శిల్ప..తన కుటుంబ సభ్యులను కాదని అతనితో వెళ్లిపోయింది. అజిజ్, శిల్పను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా శిల్ప పెళ్లి ప్రస్తావన తీసుకురాగా..అజిజ్ మాట దాటేస్తున్నాడు. ఇస్లాం మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే నగ్న చిత్రాలు బయటపెట్టి పరువు తీస్తానంటూ అజిజ్ శిల్పను వేధించసాగాడు.
other stories: Accident In Ladakh : లద్ధాఖ్ ఘోర ప్రమాదం..నదిలో పడ్డ ఆర్మీ వాహనం..ఏడుగురు జవాన్లు దుర్మరణం..
దీంతో ఎంతో మానసిక క్షోభకు గురైన శిల్ప.. బుధవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై శిల్ప కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న కుందాపూర్ పోలీసులు..శిల్ప, అజిజ్ నివాసమున్న ఇంటిని పరిశీలించి ఆత్మహత్యకు ముందు యువతీ రాసిన లేఖను కనుగొన్నారు. తాను ఎంతలా మోసపోయింది, సొంత కుటుంబ సభ్యులను కాదని అజిజ్ లాంటి దుర్మార్గుడికి దగ్గరవడం ఎంత క్షోభకు గురిచేసిందో ఆ లేఖలో వివరించింది శిల్ప. శిల్ప మృతి పై ఆమె సోదరుడు రాఘవేంద్ర స్పందిస్తూ..అజిజ్ కు గతంలోనే పెళ్లయిందని, అయినా తమ సోదరిపై వలపన్ని పధకం ప్రకారమే ఆమెను లొంగదీసుకున్నాడని అన్నారు.
other stories: Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
అజిజ్ చెప్పే మాయమాటలు నమ్మిన శిల్ప అతని చేతిలో బలైపోయిందని రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరి నగ్న చిత్రాలు తీసిన అజిజ్, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఆమెను వేధించడం ప్రారంబించాడని..ఈక్రమంలో శిల్ప పేరును కూడా సల్మా అజీజ్ గా మార్చిన అజిజ్..ఆమెను మత మార్పిడి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాఘవేంద్ర పేర్కొన్నారు. నిందితుడు అజిజ్ పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కలబురగిలోనూ లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. లవ్ జిహాద్ పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆమేరకు లవ్ జిహాద్ నిరోధక చట్టాన్ని తెచ్చే యోచనలో ఉంది.
- Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త
- Karnataka Crime : హత్యాచార కేసును ఛేదించి..నిందితుడిని పట్టించిన కుక్క
- Cat Receiving Royalties : పిల్లికి రాచమర్యాదలు చేస్తున్న పోలీసులు
- Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం
- Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్
1AIADMK: ఎంజీఆర్, జయలలితలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను: శశికళ
2Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో మరో వివాదం
3Vignesh Shivan : కొత్త కాపురం కోసం చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో.. 25 కోట్లతో రెండిళ్ళు కొన్న నయనతార..
4Gautham Raju : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..
5Lalu Prasad Yadav: హాస్పిటల్లో లాలూ.. ఫోన్ చేసి పరామర్శించిన మోదీ
6Nora Fatehi : నువ్వేమన్నా మహారాణివా?? నోరాపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..
7Lavanya Tripathi : నా కోసం కథ రాసుకున్నారు.. 9 కిలోల బరువు ఉన్న గన్స్ పట్టుకుని షూట్ చేయడం చాలా కష్టం..
8Dadishetty Raja : బచ్చాగాళ్లు, తీసిపారేస్తాం- వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
9Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు
10PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?