అగ్రకులాల రిజర్వేషన్లపై పార్టీ నేతల రెస్పాన్స్!

మోడీ కేబినెట్ 10 శాతం రిజర్వేషన్లకు ఆమోద నిర్ణయంపై విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు ఏమన్నారంటే

  • Published By: sreehari ,Published On : January 7, 2019 / 11:03 AM IST
అగ్రకులాల రిజర్వేషన్లపై పార్టీ నేతల రెస్పాన్స్!

మోడీ కేబినెట్ 10 శాతం రిజర్వేషన్లకు ఆమోద నిర్ణయంపై విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు ఏమన్నారంటే

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం.. అగ్రకులాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడం వారికి ఎంతో మేలు కలిగించే విషయమే మరి. పది శాతం రిజర్వేషన్ కోటా కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందుటకు చక్కని అవకాశంగా చెప్పవచ్చు. మోడీ కేబినెట్ 10 శాతం రిజర్వేషన్లకు ఆమోద నిర్ణయంపై విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు ఏమన్నారో వారి మాటల్లోనే..  

రాజ్ దీప్ సర్దేశాయ్ :  అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం.. మంచి నిర్ణయం. మరి ప్రభుత్వ ఉద్యోగాలు అగ్రస్థానంలో ఎక్కడ ఉన్నాయో చెప్పాలి.ఉద్యోగాలను సృష్టించడమనేది రియల్ ఛాలెంజ్.. రిజర్వేషన్లు కాదు.. ఈ నిర్ణయం.. మోడీ ప్రభుత్వానికి రెండు వైపులా పదునైనా కత్తి లాంటిదని గ్రహించాలి. 
 

అభిషేక్ స్వింఘీ : బిగ్ డెవలప్ మెంట్. కేబినెట్ 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన ఎగువ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం. మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల 8 నెలల పాలనలో రిజర్వేషన్లపై మూడు నెలల ముందు ఈ నిర్ణయం.. అందులోనూ ఎన్నికల కోడ్ అమలుకు ముందే మాత్రమే మోడీ రిజర్వేన్లపై నిర్ణయాన్ని ప్రకటించడం ఎలక్షన్ జిమ్మిక్కే.   

హార్దిక్ పటేల్: మోడీ ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఇదే చివరి అస్త్రం. ప్రజలకు ఇవ్వజూపుతున్న ఈ లాలి పప్ ముమ్మాటికి తప్పే అవుతుంది.  

బీజేపీ ఎంపీ ఉదిత్ రాయ్: రిజర్వేషన్లపై మోడీ కేబినెట్ నిర్ణయం స్వాగతించాల్సిన విషయమే. కానీ ఈ నిర్ణయంతో ఇతరులు కూడా రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తారు. 

హరీశ్ రావత్: 10 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ స్పందిస్తూ.. ఎన్నికలు దగ్గరపడినప్పుడు ప్రభుత్వానికి ఇలాంటి తప్పవు. ఎన్ని చేసిన ఫలితం ఉండదు. మోడీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టమే.  

అరవింద్ కేజ్రీవాల్: మోడీ కేబినెట్ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తా. పార్లమెంట్ సమావేశాలను పొడిగించి.. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఆమోదించాలి. లేదంటే ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ అన్నట్టే. 

రోహిణీ సింగ్: ఎగువ కులాల వారికి నిజంగా మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఎందుకు ప్రకటించలేదు. సమావేశాలు ముగిసే నాటికి ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది. 

డి రాజా : పది శాతం రిజర్వేషన్లపై మోడీ కేబినెట్ నిర్ణయం.. రాజకీయంగా ప్రేరేపితం చేయడానికే.

రామదాసు అథవాలే : రిజర్వేషన్లపై మోడీ నిర్ణయం స్వాగతించదగినది. ఈ నిర్ణయం ఎందరికో ప్రయోజనాలను చేకూర్చనుంది. ఆర్థికంగా వెనుబడిన వివిధ ఎగువ కులాల వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు కలిగిస్తుంది. 

జీవీఎల్ నరసింహారావు: జనరల్ కేటగిరీ రిజర్వేషన్లపై నరేంద్ర మోడీది చారిత్రక నిర్ణయం. సెల్యూట్ పీఎంజీ. మీకు నా అభినందనలు. దేశ ప్రజలకు ఒక ప్రధానిగా ఏం చేయాలనుకున్నారో అదే చేసి చూపించారు.