గుడ్ న్యూస్ వినిపించిన oxford : టీకా పనిచేస్తోంది..ఇమ్యునిటీ పెరుగుతోంది

  • Published By: madhu ,Published On : July 21, 2020 / 06:55 AM IST
గుడ్ న్యూస్ వినిపించిన oxford : టీకా పనిచేస్తోంది..ఇమ్యునిటీ పెరుగుతోంది

కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే..ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు Oxford విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని, ఈ సూది మంది తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి చైతన్యమైందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ప్రతొక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్చ్ హోర్టన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సురక్షితమని, తీసుకున్న వారికి సహించిందని వెల్లడించారు. ప్రస్తుతం 1077 మందిపై ప్రయోగాలు జరిపారు. వీరందరిలోనూ యాంటీబాడీలు, T – Cells విడుదలయ్యాయి. కానీ..కరోనా వైరస్ ను అంతమొందించేందుకు ఈ స్థాయి సరిపోతుందా ? లేక భారీ స్థాయిలో ప్రయోగాలు చేయాలా అనే దానిపై ఆలోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

టీకా తీసుకున్న 14 రోజులకు టి- కణాల, 28 రోజులకు యాంటీబాడీలు లాస్ట్ పీక్ కు చేరుకున్నాయన్నారు. 90 శాతం మందిలో ఒక్క డోస్ కే యాంటీబాడీలు రాగా, 10 శాతం మందికి రెండో డోస్ అవసరమైందన్నారు.

ప్రస్తుతం ప్రయోగించిన ఈ వ్యాక్సిన్ సురక్షితమని, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించలేని తెలుస్తోంది. 70 శాతం మందికి స్వల్పంగా జ్వరం లేదా తలనొప్పి, మరి కొద్ది మందిలో తిమ్మిర్లు, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. పారాసిటమాల్ తో ఇవన్నీ తగ్గిపోయాయి.

టీకా పూర్తి పని తీరు తెలుసుకొనేందుకు తర్వాతి దశలో బ్రిటన్ లో 10 వేలు, అమెరికాలో 30 వేలు, దక్షిణాఫ్రికాలో 2 వేలు, బ్రెజిల్ లో 5 వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోగా..వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటున్నారు.

ఆక్స్ ఫర్డ్ కొవిడ్ 19 వ్యాక్సిన్ 1/2 దశల ప్రయోగ ఫలితాలను ప్రచురించామని, వ్యాక్సిన్ సురక్షితమని రిచర్డ్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తిని చైతన్యం చేసిందని, రూపకర్తలైన పెడ్రో ఫొల్ గట్టి, సహచరులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

చింపాజిల్లో జలుబుకు కారణమయ్యే వైరస్ ను సేకరించి..దానిలో జన్యుపరంగా మార్పులు చేసి ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.