Election Laws Bill : ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానించే బిల్లుకి రాజ్యసభ ఆమోదం

ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021 బిల్లుకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. సోమవారమే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

Election Laws Bill : ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానించే బిల్లుకి రాజ్యసభ ఆమోదం

Voter Aadhaar 8

Election Laws Bill : ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021 బిల్లుకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. సోమవారమే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

ఇవాళ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం కూడా పొందడంతో రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారుతుంది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు రాజ్య సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్,టీఎంసీ,డీఎంకే,లెఫ్ట్ ఫార్టీలు,ఎన్సీపీ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక,బీజేపీ,జేడీయూ,వైసీపీ,అన్నాడీఎంకే,బీజేపీ,టీఎంసీ-ఎమ్ సభ్యులు ఈ బిల్లుకు మద్దుతు తెలిపారు.

ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021 బిల్లు ద్వారా…ఇక నుంచి ఓటు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నుకునే వారి నుంచి ఎన్నిక‌ల రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్లు ఆధార్ నెంబ‌ర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవ‌స‌రం అవుతుంద‌ని ప్రభుత్వం చెబుతోంది. బోగ‌స్ ఓటింగ్‌, న‌కిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలనే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపింది.

అయితే ఈ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకించాయి. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆధార్‌ను కేవ‌లం అడ్ర‌స్ ప్రూఫ్‌గా వాడార‌ని, కానీ అది పౌర‌స‌త్వ ద్ర‌వీక‌ర‌ణ ప‌త్రం కాదు అని కాంగ్రెస్ పేర్కొంది. ఓట‌ర్ల‌ను ఆధార్ అడిగితే, అప్పుడు కేవ‌లం అడ్ర‌స్ డాక్యుమెంట్ మాత్రమే వ‌స్తుంద‌ని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హ‌క్కు క‌ల్పిస్తున్న‌ట్లు అవుతుంద‌ని పేర్కొంది.

ALSO READ KMC Election Results : కోల్​కతా ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం..బీజేపీ ఫ్లాప్ షో