Subramanian Swamy : స్వామి సంచలనం..కేంద్రమంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు!

కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్​కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు​ దుమారం రేపుతోంది.

Subramanian Swamy : స్వామి సంచలనం..కేంద్రమంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు!

Swamy

Subramanian Swamy కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్​కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు​ దుమారం రేపుతోంది. ఇదే వ్యవహారంపై ప్రముఖ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించేందుకు సిద్ధమయ్యాయని ఆయన వెల్లడించారు.

కేంద్ర మంత్రులు,సుప్రీంకోర్టు జడ్జిలు,ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్​పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్​ చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్​ కు చెందిన పెగాసుస్‌ స్పైవేర్‌ సంస్థ ట్యాపింగ్​ చేసినట్లు విదేశీ మీడియా సంస్థలు..ఇవాళ సాయంత్రం వాషింగ్టన్ పోస్ట్,లండన్ గార్డియన్ వార్తలు ప్రచురిస్తాయన్న వదంతులు వస్తున్నాయని స్వామి ఆదివారం ఉదయం చేసిన ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. అదే నిజమైతే ఆ లిస్ట్ ను తాను విడుదల చేస్తానని ట్వీట్ లో స్వామి తెలిపారు.

అయితే మీ పేరు కూడా ఆ లిస్ట్ లో తప్పక ఉంటుంది,కాదంటారా అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ..,నేను పుకార్లను నిజం నుండి ఉద్భవించినప్పుడు మాత్రమే సూచిస్తాను. కానీ ఈ రోజు నిజం డాక్యుమెంట్ చేయవలసి ఉంది. అందువల్ల 2G, ఎయిర్‌సెల్ మాక్సిస్, ఎన్‌హెచ్ మొదలైన వాటిలో కోర్టుకు వెళ్లడానికి నా దగ్గర తగినన్ని డాక్యుమెంట్లె ఉన్నాయి. డాక్యుమెంట్లు లేకుంటే అది నాకు లభించే వరకు నిజం పుకారుగానే ఉంటుంది. నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అయితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను అని స్వామి బదులిచ్చారు.

కాగా, సుబ్రమణ్య స్వామి ట్వీట్ పై స్పందించిన టీఎంసీ ఎంపీ డెరక్ ఒబ్రెయిన్..చాలా మంది విపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నామయని ట్వీట్ చేశారు. పేగాసుస్ పేలబోతుందని ఓ చిన్న పిట్ట తనకు చెప్పిందని ఎంపీ కార్తీచిదంబరం కూడా ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

పెగాసుస్​ అంటే ఏంటీ?
ఇజ్రాయెల్‌ లోని NSO సంస్థ.. పెగాసుస్‌ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలకు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఈ స్పైవేర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లలో ప్రవేశపెట్టారని నిఘా వర్గాలు గుర్తించాయి. కాగా, 2019లో ఇజ్రాయెల్ తయారీ స్పైవేర్​ “పెగాసుస్” వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. పెగాసుస్ స్పైవేర్​ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు,సీనియర్ ప్రభుత్వాధికారులు,దౌత్యవేత్తలు,రాజకీయ నేతలు సహా 1400మంది ఫోన్లను హ్యాక్ చేసి సమాచారాన్ని తస్కరించారని 2019 అక్టోబర్ లో వాట్సాప్ ఆరోపించిన విషయం తెలిసిందే.