Petrol, Diesel Prices : ఆరని పెట్రో మంట..మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

చమురు సంస్థలు సామాన్యులకు వరుసగా షాకుల మీద షాక్ లు ఇస్తున్నాయి. గతకొద్ది రోజులుగా చమురు ధరలను పెంచుతూనేవున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

Petrol, Diesel Prices : ఆరని పెట్రో మంట..మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

petrol and diesel prices hike : చమురు సంస్థలు సామాన్యులకు వరుసగా షాకుల మీద షాక్ లు ఇస్తున్నాయి. గతకొద్ది రోజులుగా చమురు ధరలను పెంచుతూనేవున్నాయి. ఇది చాలదన్నట్లు నిన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మళ్ళీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 0.35 పైసలు పెరిగింది.

హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ పై 37 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.114.50 డీజిల్ రూ.107.40కు చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110 దాటింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110.04, డీజిల్ రూ.98.42కు పెరిగింది.

Electric Car : సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు..ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.115.85, డీజిల్ రూ.106.62కు చేరింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.49, డీజిల్ రూ.101.56కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.66, డీజిల్ రూ.102.59కు చేరింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లోని పలు పట్టణాల్లో పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110లకు చేరింది. అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 24 సార్లు పెరిగాయి. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 7 రూపాయలు పెరిగాయి. దేశంలో 14 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటింది.

Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు

కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,తమిళనాడు గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బెంగాల్, జమ్మూకాశ్మీర్ లేహ్‌లో డీజిల్ ధర రూ.100 దాటింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్ల కు చేరింది. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.