వాహనదారులకు యోగి షాక్ : పెట్రోల్ పై రూ.2,డీజిల్ పై రూ.1పెంపు…అర్థరాత్రి నుంచే అమల్లోకి

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 09:30 AM IST
వాహనదారులకు యోగి షాక్ : పెట్రోల్ పై రూ.2,డీజిల్ పై రూ.1పెంపు…అర్థరాత్రి నుంచే అమల్లోకి

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలు పెద్ద స్థాయిలో ఆదాయం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోల్పోయిన ఆదాయాన్ని మళ్లీ తిరిగి పొందే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.2పెంచగా,డీజిల్ పై రూ.1పెంచింది. పెరిగిన ఆయిల్ ధరలు ఇవాళ(మే-6,2020)అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని యూపీ సర్కార్ తెలిపింది. 

పెట్రోల్ పై VATను లీటర్ పై 2రూపాయలు,డీజిల్ పై 1రూపాయిని పెంచినట్లు ఉత్తరప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు. కేంద్రప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 10రూపాయల ఎక్సైజ్ డ్యూటీని,లీటరు డీజిల్ పై 13రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని విధించిన ఒక రోజు తర్వాత యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు యోగి సర్కార్ మధ్యం ధరలను కూడా రూ. 5-500 మధ్యలో పెంచిన విషయం తెలిసిందే.

కాగా,క‌రోనా లాక్ డౌన్ తో ఎదురైన ఫైనాన్షియ‌ల్ క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు  రెండు రోజుల క్రితం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచిన విషయం తెలిసిందే. గ‌త నెల‌లో నాగాలాండ్ కూడా ఇదే ర‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.