PM Modi : యూఎన్ లో మోడీ ప్రసంగం!

భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు.

PM Modi : యూఎన్ లో మోడీ ప్రసంగం!

PM Modi భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. భూ క్షీణత నివారణలో సాధించిన పురోగతి, తీసుకోవాల్సిన చర్యలపై మోడీ మాట్లాడనున్నారు. ఈ మేరకు యూఎన్ జనరల్ అసెంబ్లీ ఓ ప్రకటన విడుదల చేసింది.

2019 సెప్టెంబర్ లో న్యూఢిల్లీ వేదికగా ఎడారీకరణను ఎదుర్కోవటంపై ఐరాస ఆధ్వర్యంలో జరిగిన 14వ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈనెల 14న ఏడారీకరణను ఎదుర్కోవటంపై ఐరాస నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశంలో 14వ సదస్సు అధ్యక్షునిగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

యూఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమినా మొహమ్మద్ తో సహా అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం తరఫున వ్యవసాయ రంగ నేతలు, వారి ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. భూమి సారహీనత నివారణకు ఇప్పటివరకూ సాధించిన పురోగతి, సారవంతమైన భూమి పునరుద్ధరణకు ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై ప్రధానంగా ఐరాస సమావేశం దృష్టి సారించనుంది.

Read::Mission 2024 : మోదీని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ ? పవార్‌‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ