PM Modi : కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. ప్రధాని మోడీ కీలక సమావేశం

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.

PM Modi : కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. ప్రధాని మోడీ కీలక సమావేశం

Pm Modi

Pm Modi Key Meeting Corona : దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు. రేపు(జూన్ 10,2021) హోం శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సహా ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ కానున్నారు. ఆక్సిజన్ నిల్వలు, సరఫరా, బెడ్లు, అత్యవసర ఔషధాల లభ్యత, జమ్ముకశ్మీర్‌లో తాజా పరిస్థితులు, అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగింపు, సీఏఏ మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది.

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కష్టం ఇంకా వదిలిపెట్టనే లేదు. అప్పుడే థర్డ్ వేవ్ హెచ్చరికలు వణికిస్తున్నాయి. మొదటి, రెండో దశల్లో వృద్ధులు, మధ్య వయస్కులపై ప్రభావం చూపిన కరోనా.. మూడో దశలో చిన్నారులకు ముప్పుగా పరిణమిస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలో 8వేల చిన్నారులకు కరోనా సోకినట్లు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక వార్డులు సిద్ధం చేసింది.