PM Modi Blue Jacket: ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్ వెనుక గ్రీన్ సందేశం
తాజాగా ఆయన ధరించిన నీలం రంగు జాకెట్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈసారి చర్చలో విమర్శలకు తావులేదనుకోండి. కాకపోతే, గ్రీన్ సందేశం ఇవ్వడం కోసం ఆయన ఒక జాకెట్ ధరించారు. అది బ్లూ రంగులో ఉండడం చర్చను మరీంత ఆసక్తికి తీసుకెళ్లింది.

PM Modi wears a special blue jacket in Parliament and it is all about being green
PM Modi Blue Jacket: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి ఎంత చర్చ జరుగుతుందో ఆయన ధరించే వస్త్రాల గురించి కూడా అంతే చర్చ జరుగుతుంది. విమర్శనో, ప్రశంసనో కానీ ఆయన బట్టలు ఎప్పటికప్పుడు రాజకీయ చర్చకు దారి తీస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన ధరించిన నీలం రంగు జాకెట్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈసారి చర్చలో విమర్శలకు తావులేదనుకోండి. కాకపోతే, గ్రీన్ సందేశం ఇవ్వడం కోసం ఆయన ఒక జాకెట్ ధరించారు. అది బ్లూ రంగులో ఉండడం చర్చను మరీంత ఆసక్తికి తీసుకెళ్లింది.
Parliament updates: మోదీని ‘‘మౌనీ బాబా‘‘ అంటూ ఖర్గే విమర్శలు.. రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు వచ్చిన మోదీ.. రీసైకిల్డ్ సీసాలతో తయారు చేసిన జాకెట్ ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. లేత నీలం రంగులో ఉన్న ఈ జాకెట్‌పై హరిత సందేశం రాసి ఉంది. 2019లో మహాబలిపురం తీరంలో ప్రధాని మోదీ చెత్తను ఏరిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి చెత్త (పెట్ బాటిల్స్) నుంచి తయారు చేసిన తాజా జాకెట్ మోదీ ధరించడం గమనార్హం.
పెట్ (పాలీఇథలిన్ టెరెఫ్తలేట్) బాటిళ్లను రీసైకిల్ చేసి తయారు చేసిన నీలం రంగు జాకెట్‌ను మోదీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కానుకగా ఇచ్చింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఐఓసీ ప్రధానికి ఈ అరుదైన బహుమతిని ఐఓసీ అందజేసింది.