PM Modi : అమెరికా నుంచి పురాతన వస్తువులను భారత్ కు తీసుకొస్తున్న ప్రధాని మోడీ

భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ప్రధాని మోడీ ఇవాళ భారత్ కు చేరుకోనున్నారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా పురాతన కళాఖండాలు, వస్తువులను అమెరికా సాంస్కృతిక శాఖ భారత్​కు అప్

PM Modi : అమెరికా నుంచి పురాతన వస్తువులను భారత్ కు తీసుకొస్తున్న ప్రధాని మోడీ

Modi

PM Modi US Tour : భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ప్రధాని మోడీ ఇవాళ భారత్ కు చేరుకోనున్నారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా పురాతన కళాఖండాలు, వస్తువులను అమెరికా సాంస్కృతిక శాఖ భారత్​కు అప్పగించింది. మోడీ అమెరికా నుంచి 157 వస్తువులను భారత్ కు తీసుకొస్తున్నారు. 11 నుంచి 14వ శతాబ్దానికి చెందిన కళాఖండాలను మోడీ స్వదేశానికి తెస్తున్నారు.

కళాఖండాల్లో క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు, 12వ శతాబ్దానికి చెందిన రాగి నటరాజ విగ్రహం ఉన్నాయి. అమెరికా అప్పగించిన కళాఖండాల్లో 45 విగ్రహాలు క్రీస్తు పూర్వానికి చెందినవిగా గుర్తించారు. సగం కళాఖండాలు సంస్కృతికి సంబంధించినవి కాగా మిగిలినవి హిందూ, బౌద్ధం, జైన మతాలకు చెందిన ఆకృతులు ఉన్నాయి. అమెరికా పురాతన విగ్రహాలను భారత్​కు అందించడాన్ని మోడీ స్వాగతించారు.
Train Accident: అమెరికాలో పట్టాలు తప్పిన రైలు.. 50మంది పరిస్థితి విషమం

అక్రమ మార్గాల్లో సాంస్కృతిక వస్తువులను తరలించకుండా చర్యలు బలోపేతం చేయాలని ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు. భారత్​కు చెందిన పురాతన వస్తువులను, కళాఖండాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.