కొత్త చట్టం.. గుంతల రోడ్లపై ప్రమాదం జరిగితే.. డ్రైవర్‌దే బాధ్యత.. 10 ఏళ్ల వరకు జైలుశిక్ష!

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 12:55 PM IST
కొత్త చట్టం.. గుంతల రోడ్లపై ప్రమాదం జరిగితే.. డ్రైవర్‌దే బాధ్యత.. 10 ఏళ్ల వరకు జైలుశిక్ష!

గుంతల రోడ్లు కారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్ దే బాధ్యత అంటున్నారు అహ్మదాబాద్ పోలీసులు. ప్రపంచలోనే అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ ఉన్నది భారతదేశంలో. కానీ..రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ గుంతలున్నాయో, గతకుల రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

అంతేకాదు..ప్రమాదాల కారణంగా పలువురు చనిపోతున్నారు. అయితే..ఈ ప్రమాదాలకు డ్రైవర్ తప్ప మరెవరూ బాధ్యత వహించరని పోలీసులు వెల్లడిస్తున్నారు. మంచి డ్రైవర్ గా మెలగడం ఒక బాధ్యత అంటున్నారు. డ్రైవర్ ప్రమాదానికి కారణమయితే..పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేయనున్నారు.




సెక్షన్ 304 ప్రకారం..బెయిల్ సాధారణంగా రాదు. జైలు శిక్ష కఠినంగా ఉండనుంది. పదేళ్ల వరకు శిక్ష పొడిగించడమో జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 304 ఏ ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉండనున్నాయి.

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ చట్టాలను ఫాలో కావాలని అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. వేగంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ప్రమాదానికి కారణమయితే..కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పోలీసులు ఇప్పటికే సెక్షన్ 304 కింద వాహనదారులను బుక్ చేయడం ప్రారంభించారని సమాచారం.

అహ్మదాబాద్ – వడోదర ఎక్స్ ప్రెస్ హైవేపై 18 బాలిక వాహనాన్ని మరొక వాహనం ఢీకొట్టడంతో కేసును బుక్ చేశారు. కొత్త నిబంధన ప్రకారం ఫస్ట్ డ్రైవర్ అయ్యాడు.




అధికారంలో ఉన్న వారిని బుక్ చేయాలి కానీ..ఇలా చేయడం కరెక్టేనా అనే ప్రశ్నలకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని కొశ్చన్ చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని డీసీపీ తేజస్ పటేల్ తెలిపారు.

రోడ్లపై గుంతలు ఏర్పడితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు వెల్లడిస్తున్నారు. కానీ..డ్రైవర్ దే బాధ్యత అని అహ్మదాబాద్ పోలీసులు తీసుకొచ్చిన చట్టం..ఇతర నగరాలు ఫాలో అవుతాయా ? అనేది చూడాలి.