కరోనాను జయించిన 26మంది కుటుంబం..మహమ్మారిని మట్టికరిపించిన ఉమ్మడి కుటుంబం

ప్రయోగ్ రాజ్ లో 31 మంది కుటుంబ సభ్యులున్న ఓ ఉమ్మడి కుటుంబం కరోనాను జయించింది. కుటుంబంలో 26మందికి కరోనా సోకగా అందరూ కరోనా నుంచి బైటపడ్డారు.

కరోనాను జయించిన 26మంది కుటుంబం..మహమ్మారిని మట్టికరిపించిన ఉమ్మడి కుటుంబం

Prayagraj Joint Family Corona 26 People

prayagraj : వారిది ఉమ్మడి కుటుంబం. అందరూ ఒకే ఇంటిలో ఉంటారు. వారందరూ ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో పోరాడారు. జయించారు. 26మందితో ఉన్న ఉమ్మడి కుటుంబం అంతా కలిసి కట్టుకోగా కరోనాతో పోరాడి జయించారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఎంతోమంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ ఉమ్మడిగా నివసించే 26మందితో కూడిన కుటుంబం అంతా ఇప్పుడు చక్కగా కోలుకున్నారు.

ఆజాద్ నగర్ లో నివసిస్తున్న బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రసాద్ మిశ్రా కుటుంబానికి చెందిన‌ 26 మంది ఒక్కొక్క‌రుగా క‌రోనా బారిన ప‌డ్డారు. కానీ వీరంతా క‌రోనా నుంచి కోలుకున్నారు. ఆ తరువాత వారు క‌రోనా బాధితుల‌తో ధైర్యాన్ని నింపుతున్నారు. భయపడొద్దు..ధైర్యంగా ఉండండీ..అంటూ ధైర్యాన్ని చెడుతున్నారు. రాఘవేంద్ర మిశ్రా చిన్న కుమారుడు ఏప్రిల్ 11 న కరోనా బారిన పడ్డాడు.

ఆ త‌రువాత కుటుంబంలో 26 మంది సభ్యులకు కూడా కరోనా సోకింది. ఉమ్మడి కుటుంబం కావడంతో వారి ఇంటిలో మొత్తం 31 మంది ఉన్నారు. పది రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలోని 26 మంది సభ్యులకు క‌రోనా సోకింది. వీరిలో 87 ఏళ్ల వృద్ధుడు రాఘవేంద్ర మిశ్రా కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఇంట్లోని వారంతా ఆందోళన‌ ప‌డ్డారు. రాఘవేంద్ర మిశ్రా 2012లో తన కుమారునికి కిడ్నీ దానం చేశారు. ఒకే కిడ్నీ ఉన్న రాఘవేంద్ర గురించి మరింతగా ఆందోళన పడ్డారు మిగిలిన కుటుంబ సభ్యులు.

కానీ రాఘవేంద్ర మాత్రం ధైర్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా మిశ్రా కుమారుడు రవీంద్ర మిశ్రా మాట్లాడుతూ క‌రోనా బారిన ప‌డిన తామంతా డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ వాడి..చక్కటి ఆహారం తీసుకుని ధైర్యంగా ఉన్నామని..అలాగే ప్రతీరోజూ..క్రమంతప్పకుండా యోగా చేయ‌డం..ఆవిరి పట్ట‌డం, కషాయాలు ఇంట్లోనే తయారు చేసుకుని తాగేవారమని..అలాగే పాలల్లో పసుపు వేసుకని తాగేవారని అలా ఇమ్యూనిటీని పెంచుకుని త‌మ ఇంట్లోనివారంతా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డామ‌ని తెలిపారు.