PM Modi: ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు .. ప్రతిపక్షాలకు మోదీ కీలక సూచన

జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు.

PM Modi: ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు .. ప్రతిపక్షాలకు మోదీ కీలక సూచన

PM modi

Parliament Special Sessions 2023: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు పార్లమెంట్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోందని, కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని అన్నారు. ప్రస్తుతం ఐదు రోజులపాటు జరిగే ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని మోదీ చెప్పారు.

Parliament : నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు… కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులపై ఉత్కంఠ

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిడివి తక్కువే అయినప్పటికీ.. సందర్భం చాలా గొప్పదని, ఈ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తారని భావిస్తున్నానని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని గుర్తుంచుకోవాలని కోరారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ సమావేశాలు నిర్వహించుకుందామని, సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు మోదీ అన్నారు.

IIT Kanpur Recruitment : కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్ జీ20 శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్  గర్వపడుతుందని, ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం అని మోదీ అన్నారు. చంద్రయాన్-3 విజయవంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, మన జెండా సగర్వంగా రెపరెపలాడుతుందని మోదీ అన్నారు.