PM Modi mother Carries Mortal Remains : తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ .. హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి
కన్నతల్లి పాడె మోసారు ప్రధాని మోడి. భారతీయ సంప్రయాలను పాటించారు మోడీ. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి.

PM Modi mother Carries Mortal Remains : దేశానికి రాజు అయినా తండ్రికి బిడ్డే కదా..అమ్మ కన్నుమూసి కనుమురుగు అవుతుంది అంటే ఏ బిడ్డకైనా భావోద్వేగం పొంగిపొర్లుతుంది. అలాగే భారత ప్రధాని మోడీ కూడా తన తల్లి మరణంతో తన బాధ్యతలను నెరవేర్చారు. కన్నతల్లి పాడె మోసారు ప్రధాని మోడి. భారతీయ సంప్రయాలను పాటించారు మోడీ. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాదు ప్రధాని మోడీ తన మాతృమూర్తి పాడెను మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్దే కూర్చొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ప్రక్రియలో మోడీ చాలా భావోద్వేగంగా కనిపించారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా మోడీ ముందుగా తన తల్లి ఆశీర్వాదాలు తీసుకునే ప్రారంభించేవారు. తల్లితో కలిసి ఎంతో ఆనందంగా భోజనం చేసేవారు. అటువంటి తల్లి దూరం కావటంతో మోడీ ఆవేదనచెందుతున్నారు. కానీ ప్రాణం ఉన్నంత వరకే ఈ బంధాలు భౌతికంగా కొనసాగుతాయి. ఆ తరువాత ఆత్మీత అంతా మానసికంగా కొనసాగుతాయి.
ఎంత బాధ ఉన్నా ఎంత గొప్పవారైనా ప్రాణం శరీరాన్ని విడిచాక జరగాల్సిన కార్యక్రమాలు కొనసాగింపు తప్పదు. అలాగే ఆ ప్రధాని మోడీ తన తల్లి దహన సంస్కార కార్యమంలో ప్రతీ అంశంలోను పాలు పంచుకున్నారు. దీంట్లో భాగంగా గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తిచేశారు. మోడీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు.