Farmers Anger: యూరియా కోసం ధర్నా చేసి ఆపై లూటీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లా విషయమేంటని ఆరా తీశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా ఎరువులు పంపిణీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడే ఉన్న అధికారులు మాత్రం ఆన్‌లైన్ సమస్యల కారణంగా యూరియాను పంపిణీ చేయలేకపోతున్నామని, ఒక్క రోజులో సరిచేసి పంపిణీ చేస్తామని సమాధానం చెప్పారు.

Farmers Anger: యూరియా కోసం ధర్నా చేసి ఆపై లూటీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Protest For Fertiliser Ends In Loot

Farmers Anger: యూరియా కోసం రైతులు చేపట్టిన ధర్నా చివరికి లూటీ వరకు వెళ్లింది. గంటల తరబడి ధర్నా చేసిన రైతులు.. ఎమ్మెల్యే ఎంట్రీతో యూరియా సంచుల్ని లూటీ చేశారు. కాగా, లూటీకి ప్రధాన కారకుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లాపై కేసు నమోదు అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం జిల్లాలో జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్థానిక మీడియా తెలిపిన సమాచారం ప్రకారం.. ఎరువుల కోసం ఓ దుకాణం ముందు గంటల తరబడి వేచి చూసిన కొంత మంది రైతులకు ఎంతసేపటికీ ఎరువులు అందకపోవడంతో వారందరూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లా విషయమేంటని ఆరా తీశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా ఎరువులు పంపిణీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడే ఉన్న అధికారులు మాత్రం ఆన్‌లైన్ సమస్యల కారణంగా యూరియాను పంపిణీ చేయలేకపోతున్నామని, ఒక్క రోజులో సరిచేసి పంపిణీ చేస్తామని సమాధానం చెప్పారు.

రైతులకు యూరియా అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. రైతుల వైపు తిరిగి ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లాలని చెబుతూ గోడౌన్ షట్టర్‌ను స్వయంగా పైకి ఎత్తారు. అంతే.. ఒక్కసారిగా రైతులు గోడౌన్ లోపలికి దూసుకెళ్లిన యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఎరువుల సెంటర్ ఇన్‌చార్జ్ ఫిర్యాదు మేరకు దోపిడీ, అధికారులపై దాడి సహా పలు అభియోగాల కింద ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో ఎమ్మెల్యే చావ్లాతో పాటు కాంగ్రెస్ నేత యోగేంద్ర సింగ్ జాదోన్, ఇతరుల పేర్లను చేర్చారు. వీడియో ఆధారంగా ఇతర నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు ఎస్పీ అభిషేక్ తివారీ పేర్కొన్నారు.

తనపై కేసు నమోదు కావడంపై ఎమ్మెల్యే చావ్లా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును ఫేక్ అని కొట్టిపడేశారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, రైతుల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీ కలిసి తనపై ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. ఇదంతా అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్న వ్యవహారమని ఎమ్మెల్యే చావ్లా ఆరోపించారు.

Viral Video: సఫారి వాహనంలోకి ఎగిరి దూకిన సింహం.. సందర్శకులకు సరికొత్త అనుభూతి.. ఇంతకీ సింహం ఏం చేసిందంటే