Kashmir Pandit Killing: కశ్మీర్‌లో పండిట్ హత్యకు వ్యతిరేకంగా భారీ నిరసనలు: కేంద్రం భద్రత కల్పించాలని విజ్ఞప్తి

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఒక పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి

Kashmir Pandit Killing: కశ్మీర్‌లో పండిట్ హత్యకు వ్యతిరేకంగా భారీ నిరసనలు: కేంద్రం భద్రత కల్పించాలని విజ్ఞప్తి

Pandit

Kashmir Pandit Killing: జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఒక పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ కు 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తెహిసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈక్రమంలో మంగళవారం నాడు రాహుల్ భట్ ను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Read Others:Rhino Horn Poached: అస్సాంలో ఖడ్గమృగం కొమ్మును కోసేసిన వేటగాళ్లు: 2017 తరువాత మొదటి ఘటన

కేంద్ర సాయుధ బలగాలతో ఇక్కడ తమకు భద్రత కల్పించాలని పండిట్ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ తమ సాంప్రదాయ భూభాగమని, ఇక్కడ ఉగ్రవాదులను తరిమికొట్టి..తమ శాశ్వత రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల చేతిలో హతమైన పండిట్ రాహుల్ భట్ మృతిపై విచారణ జరిపించాలని అతని తండ్రి బితా భట్ డిమాండ్ చేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బితా భట్ డిమాండ్ చేశారు. శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన పండిట్ సంఘాల సభ్యులు, ఇతర వర్గాల ప్రజల అశ్రునయనాల మధ్య రాహుల్ భట్ అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

Also Read:Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్