Punjab CM: పంజాబ్ సీఎం చన్నీ కుటుంబానికి కొవిడ్ పాజిటివ్

పంజాబ్ సీఎం ముగ్గురి కుటుంబ సభ్యులకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని అధికారిక సమాచారం. సీఎంకు చేసిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు.

Punjab CM: పంజాబ్ సీఎం చన్నీ కుటుంబానికి కొవిడ్ పాజిటివ్

Punjab Cm

Punjab CM: పంజాబ్ సీఎం చన్నీ కుటుంబ సభ్యులైన ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులైన భార్య, కొడుకు, కోడలికి పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా సీఎంకు కొవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మొహాలీ సివిల్ సర్జన్ డా. ఆదర్శపాల్ కౌర్  చన్నీ భార్య కమల్జిత్ కౌర్, నవజిత్ సింగ్, కోడలు సిమ్రంధీర్ కౌర్ కు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లో ఉన్నారు.

బుధవారం సాయంత్రం సీఎం చన్నీ ఛండీఘడ్ లో ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టి ఫిరోజ్ పూర్ లో పీఎం అఫీషియల్ ప్రోగ్రాంకు తాను హాజరుకాలేనని చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు పర్సనల్ అసిస్టెంట్ కు కూడా కొవిడ్ పాజిటివ్ రావడమే ఇందుకు కారణమని వివరించారు.

ఇది కూడా చదవండి: యూపీలో BJP MLA చెంప ఛెళ్లుమనిపించిన రైతు..