శత్రుదేశం గుండెల్లో రైళ్లు : రాఫెల్ యుద్ధ విమానం ప్రత్యేకతలు

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 01:42 AM IST
శత్రుదేశం గుండెల్లో రైళ్లు : రాఫెల్ యుద్ధ విమానం ప్రత్యేకతలు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్‌లో రాఫెల్ జెట్ ఎంట్రీ అదిరిపోయింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా..అనుకున్న సమయానికే రాఫెల్ జెట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు. గంటకి 2 వేల 222కిలోమీటర్ల వేగంతో 50 వేల అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3700 కిలోమీటర్లు..ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు..వింగ్ స్పాన్ చూస్తే..దాదాపు 11మీటర్లు..ఒకేసారి 9500కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్ధ్యం రాఫేల్ సొంతం ఇది సుఖోయ్ కంటే కూడా 1500కిలోలు ఎక్కువ. నిమిషానికి 2500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు..అన్నింటికంటే పెద్ద విషయం..అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫేల్ అతి పెద్ద ప్రత్యేకత.

రాఫేల్ ఫస్ట్ బ్యాచ్ మొహరింపు కూడా వ్యూహాత్మకంగానే చేయబోతోంది కేంద్రం, పంజాబ్‌లోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో వీటిని మోహరించబోతోంది..ఇది ఇండో-పాక్ సరిహద్దులకు అతి దగ్గర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్..పగలూ రాత్రి తేడా లేకుండా..ఎక్కడి లక్ష్యాన్నైనా ఈజీగా  చేధించడం రాఫెల్ స్పెషాల్టీ. సరిహద్దు దాటకుండానే..పాక్‌లోని ఓ మూల టార్గెట్‌నైనా ఇట్టే చేధించగలదు. రాఫేల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు భారత్ కి ముందు మూడే అవి ఫ్రాన్స్..ఈజిప్ట్, ఖతార్..ఎయిర్ టు ఎయిర్-మీటియోర్స్ మిస్సైల్స్, ఎయిర్ టూ గ్రౌండ్ స్కాల్ఫ్ మిస్సైల్స్‌ని రాఫేల్‌లో తీసుకెళ్లవచ్చు.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే..19ఏళ్ల క్రితమే అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం రాఫెల్‌ కొనుగోలు చేయాలనుకుంది..కానీ 2007లో యూపిఏ హయాంలోనే కొనుగోళ్ల విషయం కాస్త కదిలింది. అనేక దేశాలనుంచి టెండర్లను పిలిచింది కానీ..2012నాటికే అది అగ్రిమెంట్ దశకి వచ్చింది. 54వేల కోట్ల రూపాయల ఖర్చుతో 126 రాఫెల్ జెట్ ఫైటర్ల కోసం డీల్ కుదుర్చుకుంది..18 విమానాలు వెంటనే వచ్చేట్లు..మిగిలినవి బెంగళూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో తయారు చేసేట్లు డీల్ కుదిరింది..కానీ ఆ తర్వాత బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఏ అధికారపగ్గాలు చేపట్టింది. 2015 సెప్టెంబర్‌లో  ‌ఫ్రాన్స్‌కి వెళ్లిన మోదీ..యూపిఏ డీల్‌ని క్యాన్సిల్ చేశారు. 36 జెట్ ఫైటర్లే కొంటున్నట్లు అనౌన్స్ చేసారు. ఫ్రాన్స్ కంపెనీ దసో ఏవియేషన్‌తో ఒప్పందం కుదిరింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఇందులో అవినీతి జరిగిందంటూ దాడికి దిగింది. ఈ పరిణామాలు మధ్యనే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. తిరిగి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రావడంతో రాఫేల్ కొనుగోలు ఒప్పందానికి ఢోకా లేకుండా పోయింది. ఫస్ట్ బ్యాచ్ రాఫెల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిపోయింది