Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ

లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ..భారత విదేశాంగశాఖ నుంచి ప్రభుత్వానికి సంబంధించి (రాజకీయంగా) అనుమతి తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ

Rahul1

Rahul Gandhi: పలు అధికారిక సమావేశాలు, వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వేదికగా..జరిగిన “ఐడియాస్ ఫర్ ఇండియా” కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ..ప్రధాని నరేంద్ర మోదీ, అధికార బీజేపీలపై విషం వెళ్లగక్కారు. రాహుల్ వ్యాఖ్యలపై గత నాలుగు రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇదిలాఉంటే..లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ..భారత విదేశాంగశాఖ నుంచి ప్రభుత్వానికి సంబంధించి (రాజకీయంగా) అనుమతి తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రూల్స్ ప్రకారం..ఒక పార్లమెంటు సభ్యుడుగానీ, ఇతర రాజకీయ నేతలు గానీ దేశం విడిచి వెళ్లాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అటువంటి అనుమతులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.

Other Stories:Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్

అదే సమయంలో వారు ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్తున్నారో..ఆయా కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఆహ్వానం నేరుగా కాకుండా విదేశాంగ శాఖకు చేరాల్సి ఉంటుంది. వ్యక్తిగతమైనా, అధికారిక పర్యటనైనా..ఆ ఆహ్వానం తాలూకు వివరాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ పై రెండిటిలో ఏ ఒక్క పద్ధతిని పాటించలేదని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. కాగా లండన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ దేశం పరువు తీసేలా మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే విదేశాంగశాఖ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దీనిపై రాహుల్ గాంధీని ప్రభుత్వం వివరణ కోరే అవకాశం ఉంది.

other stories:PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్‌ చెక్కపెట్టె’ గురించి తెలుసా