కరోనాను ఎదుర్కోవడానికి డైరక్ట్‌గా విటమిన్లు మింగేస్తున్నారు

కరోనాను ఎదుర్కోవడానికి డైరక్ట్‌గా విటమిన్లు మింగేస్తున్నారు

కరోనా కారణంగా ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. పొరపాటున కరోనా అంటుకున్నా ఈజీగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఒకే ఒక్క మార్గం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటమే.




అయితే వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు చాలా మంది ఇప్పుడు చేస్తుంది ఏంటంటే చికెన్, మటన్, గుడ్లు, ఆకుకూరలతో పాటు వివిధ రకాల విటమిన్లను అధిక మోతాదులోనే తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో విటమిన్ సి, డి, జింక్ లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోమంటున్నారు వైద్యులు.

అయితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. శ్రుతి మించిదే ఏదైనా మంచిది కాదు. అంటే ఏ విటమిన్లైనా తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. సరైన ఆహారం ఒక నెల రోజుల పాటు తింటే సరిపోతుంది . ఈ విషయం తెలియక కొందరు దీర్ఘకాలం వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగుతుందో లేదో తెలియదు కానీ లేని రోగాలను కొని తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. కేవలం వైద్యుల సూచన మేరకే ఎలాంటి విటమిన్లైనా దీర్గకాలం తీసుకోవడం మంచింటున్నారు.




కరోనాకు ముందు విటమిన్‌ సి, డి, జింక్‌ గోలీల అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. వారి వారి ఆరోగ్య సమస్యల మేరకు వైద్యులు సూచిస్తే .. వాటిని కొని వాడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు తెగ కొంటున్నారు. దీంతో మార్కెట్లో సి, డి విటమిన్‌ గోలీల సరఫరా పెంచేకొద్దీ కొరత ఏర్పడుతూనే ఉంది.

ఏ విటమిన్లు ఎలా తెలుసుకోవాలి.. ఎందుకు తీసుకోవాలి:

విటమిన్‌ సి: పెద్దలకైతే రోజూ 65-95 మి.గ్రా మించకుండా తీసుకోవాలి.




విటమిన్‌ ఎ: కొవ్వుల్లో కరుగుతుంది. మోతాదు కంటే ఎక్కువ వాడితే కొన్నిసార్లు విషపూరితంగా మారుతుంది. జుట్టు రాలిపోవడం, కాలేయం దెబ్బతినడం, ఎముకల్లో నొప్పి, దృష్టి లోపం, పొడి చర్మం లాంటి సమస్యలు తలెత్తవచ్ఛు

జింక్‌: పరిమితికి మించి వాడితే అజీర్ణం, అతిసారం, వాంతులు వస్తాయి. అధిక మోతాదులో దీర్ఘకాలం తీసుకుంటే కాపర్‌ లోపం ఏర్పడుతుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టి నాడీ సమస్యలకు దారి తీస్తుంది.




విటమిన్‌ డి: అధికంగా తీసుకోవడం హానికరం. రోజుకు 4 వేల యూనిట్ల కంటే ఎక్కువ వాడితే వాంతులు, మలబద్ధకం ఇతర సమస్యలతోపాటు కిడ్నీపై ఎఫెక్ట్ చూపెడుతుంది.

విటమిన్‌ ఇ: మోతాదు కంటే ఎక్కువ వాడితే రక్తం గడ్డకట్టే సామర్థ్యానికి ఇబ్బంది ఏర్పడుతుంది.

బి6: ఎక్కువైతే నరాల సమస్య. విటమిన్‌ బి3 కూడా అంతే. మోతాదు మించితే వికారం, కాలేయం విడుదల చేసే ఎంజైమ్‌ స్థాయిలు పెరగడం వంటివి కనిపిస్తాయి.