సెల్ రీఛార్జ్ విషయంలో అన్నతో గొడవ.. చెల్లి సూసైడ్

సెల్ రీఛార్జ్ విషయంలో అన్నతో గొడవ.. చెల్లి సూసైడ్

మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు ప్రాణాలు తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. రాజస్థాన్ లోని ఝున్‌ఝును పట్టణంలో ఓ బాలిక అన్నతో గొడవపడి సూసైడ్ చేసుకుంది. అన్నాచెల్లెళ్లు గొడవపడటంతో మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించనంటూ వారించింది. దాంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అధికారులు అంటున్నారు.

కొత్వాలీ పోలీస్ స్టేషన్లో మృతురాలి మేనమామ షెకావత్ అలీ ఫిర్యాదు మేర కేసు నమోదు చేశారు. మేనకోడలు ఖేరున్నిసా చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ ఘటనపై ఇలా వెల్లడించాడు.

‘అన్నాచెల్లెల్లి మధ్య చిన్నపాటి గొడవ అయింది. ఖేరున్నిసా గేమ్స్ ఆడుకునేందుకు మొబైల్ ఫోన్ కావాలని అడిగింది. అదే సమయంలో అన్న కూడా గేమ్ ఆడుతున్నాడు. ఇదే విషయంలో ఇద్దరూ గొడవపడుతుండటంతో తల్లి వారిని తిట్టింది. దీని తర్వాత ఇక మొబైల్ రీఛార్జ్ చేయించనంటూ బెదిరించింది’ అని తెలిపారు.

బాలిక మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోదరుడు ఎనిమిదో తరగతి చదువుతుండగా బాలిక చదువుమానేసి ఇంట్లోనే ఉంటుంది. తండ్రి మరణించడంతో బాలిక తల్లితో పాటు ఇంట్లోనే ఉంటుంది. మరదలు, తమ్ముడు, అన్న అందరూ విదేశాల్లో పనిచేస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.