Free Mobile For Womens : మహిళలకు స్మార్ట్‌ఫోన్‌ తో పాటు..3 ఏళ్లు ఇంటర్నెట్‌ ఫ్రీ..ప్రకటించిన ప్రభుత్వం

రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లతో పాటు మూడున్నర ఏళ్లపాటు ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇవ్వాలని యోచిస్తోంది.

Free Mobile For Womens : మహిళలకు స్మార్ట్‌ఫోన్‌ తో పాటు..3 ఏళ్లు ఇంటర్నెట్‌ ఫ్రీ..ప్రకటించిన ప్రభుత్వం

Free Mobile For Womens

Free Mobile For Womens : రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వటంతో పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ కూడా ప్రకటించింది. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించామని శుక్రవారం (8,2022) అధికారులు ప్రకటించారు. అంతేకాదు మూడేళ్ల పాటు ఉచితంగా ఇంటర్నెట్ తో పాటు ఇతర సేవలను కూడా అందించాలని నిర్ణయించింది. దీని కోసం రూ.12వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థల నుంచి అక్కడి యంత్రాంగం బిడ్లను ఆహ్వానించింది.ఆగస్టు నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘ఉచిత’ స్కీమ్‌కు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.సీఎం డిజిటల్‌ సేవా యోజన పథకాన్ని 2022 బడ్జెట్‌లోనే ప్రకటించారు.ఈక్రమంలో దీనికి సంబంధించిన విధివిధానాలు..టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ పథకం కింద చిరంజీవి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించనుంది ప్రభుత్వం. దీని కోసం 1.35 కోట్లుగా ఈ లెక్క అంచనా వేశారు. వీరికి ఉచిత స్మార్ట్‌ఫోన్‌తో పాటు, మూడేళ్ల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు.

ఈ ఫోన్ లో మొదటి సిమ్‌కార్డు లాక్‌ చేసి ఉంటుంది. రెండో సిమ్‌ స్లాట్‌లో ఇంకో సిమ్‌ కార్డు వేసుకునే వీలుంటుంది. స్మార్ట్‌ఫోన్‌, మూడేళ్ల ఇంటర్నెట్‌ కలిపి మొత్తం రూ.12వేల కోట్లు అవుతుందని అధికార వర్గాలు వివరిస్తున్నారు. దీనికోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా పోటీ పడుతోంది. ఏ కంపెనీకి ఈ టెండర్‌ దక్కినా ఒక్కసారి 1.35 కోట్ల వినియోగదారులు వచ్చి చేరినట్లే.