ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..

భారత భద్రతాబలంలోకి మరో అస్త్రం వచ్చి చేరుతోంది. అదే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ఐసీజీఎస్‌ విగ్రహ నౌక’. ఈ నౌకను రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు.

ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..

Indian Coast Guard Ship Vigraha

Indian Coast Guard Ship Vigraha : భారత భద్రతా బలం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నో అధునాత ఆయుధాలు కలిగిన భారత భద్రతాబలంలోకి మరో అస్త్రం వచ్చి చేరుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌక కోస్ట్ గార్డ్ అమ్ములపొదిలో అతి బలమైన ఆయుధం వచ్చి చేరుతోంది.. అదే ‘ఐసీజీఎస్‌ విగ్రహ నౌక’. పేరులోనే విగ్రహం కలిగిన ఈ నౌక నిజంగా అంత బలమైనదే.భారత తీర గస్తీదళంలో ఇది ‘ఐసీజీఎస్‌ విగ్రహ నౌక చాలా ప్రత్యేకమైనది.

Rajnath Singh to commission Coast Guard patrol vessel Vigraha - India News

అడ్వాన్స్‌డ్‌ ఫైర్‌ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్‌ విగ్రహ నౌకను చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఈ అపురూపమైన ఘట్టం ఆగస్టు 28,2021న జరుగనుంది.ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌ సిరీస్‌లో ఏడో నౌక అయిన విగ్రహని చెన్నైలోని ఎల్‌ అండ్‌ టీ షిప్‌ బిల్డింగ్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించింది. ఈ నౌక కోస్ట్‌గార్డు ఈస్ట్రన్‌ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖపట్నం నుంచి ఈ విగ్రహ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది.

Rajnath Singh to commission Coast Guard's offshore patrol vessel Vigraha

ఐసీజీఎస్‌ విగ్రహ చేరడంతో.. కోస్ట్‌గార్డ్‌ లిస్టులో నౌకల సంఖ్య 157కు చేరుతుంది. మరోవైపు మన కోస్ట్‌గార్డ్‌కు ఇప్పటికే 66 విమానాలున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌక అధునాతన సాంకేతిక వసతులున్నాయి. దీని పొడవు 98 మీటర్లు, వెడల్పు 15 మీటర్ల, 3.6 మీటర్ల డ్రాట్‌తో ఉంది.

New Coast Guard vessel to be inducted on Wednesday

ఈ విగ్రహ బరువు 2,200 టన్నులు. 9,100 కిలోవాట్స్‌ డీజిల్‌ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లు కలిగి ఉంది. దీని వేగం విషయానికి వస్తే..26 నాటికల్‌ మైళ్ల వేగంతో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్‌ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశను మార్చుకునే యంత్ర సామర్థ్యం ఈ విగ్రహ సొంతం. 40/60 బోఫోర్స్‌ గన్, ఫైర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో 12.7 మిల్లీమీటర్ల స్టెబిలైజ్డ్‌ రిమోట్‌ కంట్రోల్‌ గన్‌లు రెండు ఉన్నాయి.

Defence Minister Rajnath Singh commissions ICGS Varaha - The Hindu  BusinessLine

రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్‌ ఇంజిన్‌ హెలికాప్టర్, నాలుగు హైస్పీడ్‌ బోట్లు తీసుకెళ్లగలదు. సముద్రంలో చమురుతెట్టు వంటి కాలుష్యాల నియంత్రణకు స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉంది.