Indias Most Expensive Rakhi : అత్యంత ఖరీదైన రాఖీ..ధర ఎంతో తెలిస్తే షాకే..

గుజరాత్ లోని సూరత్ లో దేశంలోనే అత్యంత ఖరీదైన రాఖీలను తయారు చేసి శ్రీమంతులను ఆకర్షిస్తోంది ఓ వజ్రాల సంస్థ. ఈ రాఖీ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Indias Most Expensive Rakhi : అత్యంత ఖరీదైన రాఖీ..ధర ఎంతో తెలిస్తే షాకే..

Indias Most Expensive Rakhi

Indias Most Expensive Rakhi : అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పే రాఖీ పౌర్ణమి మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సోదరులకు కట్టే రాఖీల్లో ఆర్థిక స్తోమతలను చూపిస్తోంది. కానీ కట్టేది బంగారం రాఖీ అయినా..ఒట్టి దారానికి చిన్న పువ్వును జతకట్టి సోదరికి క్షేమాన్ని కోరుతు సోదరి కట్టే రాఖీ అనుబంధంలో మాత్రం మార్పు ఉండదనే చెప్పాలి.కానీ ఆయా పండుగలను..సందర్భాలను కూడా మార్కెట్ తనదైన శైలిలో ప్రభావం చూపిస్తోంది. ఆగస్టు 11న వచ్చింది. దీంతో మార్కెంట్లో సందడితో రంగు రంగుల రాఖీలతో కళకళలాడిపోతున్నాయి.

Also read : Diamond Rakhis : సూరత్ లో వజ్రాల రాఖీలు..ధర ఎంతో తెలుసా..?

ఈక్రమంలో గుజరాత్ లోని సూరత్ లో దేశంలోనే అత్యంత ఖరీదైన రాఖీలను తయారు చేసి శ్రీమంతులను ఆకర్షిస్తోంది ఓ వజ్రాల సంస్థ. రక్షా బంధన్ పండుగను క్యాష్‌ చేసుకునేందుకు దుకాణాలు,పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కస్టమర్‌లను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈక్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ దుకాణం కొన్ని ప్రత్యేకమైన రాఖీలను తయారు చేసింది.

దారపు రాఖీలు మొదలుకొని బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు పొదిగిన రాఖీల వరకు ఉన్నాయి. ఈ రాఖీల అందాన్ని, డిజైన్లను ప్రజలు కొనియాడుతున్నారు. ఇక్కడ తయారు చేయించిన రూ.5 లక్షల విలువైన రాఖీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది..!

Also read :సరికొత్త ట్రెండ్ ఇదే : వజ్రాలు, ముత్యాలతో లగ్జరీ మాస్క్‌లు..

సూరత్‌లోని ఒక జ్యువెలర్ షోరూమ్‌లో బంగారం, వెండి, ప్లాటినంతో వివిధ రకాల రాఖీలు తయారు చేయబడ్డాయి. ఈ షోరూమ్‌లో రక్షాబంధన్ పండుగ కోసం రూ.400 నుంచి రూ.5 లక్షల వరకు రాఖీలను సిద్ధం చేశారు. నగల దుకాణం యజమాని దీపక్ భాయ్ చోక్సీ మాట్లాడుతూ..మేము తయారుచేసిన రాఖీలను రక్షాబంధన్ తర్వాత ఆభరణాలుగా కూడా ధరించవచ్చని ఇవి ధరంచటానికి ప్రత్యేకించి పండుగే అవసరం లేదని చెబుతున్నారు.

Also read : మాస్క్ మహారాజ్: రూ.11 కోట్లతో మాస్క్ తయారు చేయించుకుంటున్న వ్యాపారి…