Reliance : కొత్త వ్యాపారం.. త్వరలో చీరల దుకాణం

ప్రముఖ బిజినెస్ దిగ్గజం రిలయన్స్ ఇప్పటికే పలు రంగాల్లో వ్యాపారం చేస్తోంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. తాజాగా మరో కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మహిళలకు

Reliance : కొత్త వ్యాపారం.. త్వరలో చీరల దుకాణం

Reliance

Reliance : ప్రముఖ బిజినెస్ దిగ్గజం రిలయన్స్ ఇప్పటికే పలు రంగాల్లో వ్యాపారం చేస్తోంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. తాజాగా మరో కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మహిళలకు ఇష్ట‌మైన చీర‌లు, సంప్ర‌దాయ దుస్తులు, ఆభ‌ర‌ణాల కోసం దుకాణాలు ప్రారంభించ‌డానికి రిల‌య‌న్స్ రిటైల్ రంగం సిద్ధం చేసింది. అవంత్రా బ్రాండ్ స్టోర్ల పేరుతో(శారీ, ఎత్నిక్ వేర్) మార్కెట్ లోకి రానుంది.

సంప్ర‌దాయ దుస్తులు, చీర‌ల మార్కెటింగ్‌లో టాటా స‌న్స్ గ్రూప్ త‌నిష్క‌, ఆదిత్య బిర్లా ఫ్యాష‌న్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్‌)తో పోటీ ప‌డేందుకు రిలయన్స్ సిద్ధం అయ్యింది. పండుగ‌ల సీజ‌న్‌తోపాటు వివాహాల సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రిల‌య‌న్స్ రిటైల్ ప్ర‌క‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. బ్రిక్ అండ్ మోర్టార్ చైన్ స్థాయిలో మిడ్ సైజ్ స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి.

Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..

సంప్రదాయ దుస్తులు, జువెలరీ బ్రాండ్‌కు త‌నిష్క్ పెట్టింది పేరు. ఇక స‌వ్య‌సాచి, త‌రుణ్ తాహిల్యానీ లేబుల్స్‌తో డొమెస్టిక్ డిజైన‌ర్ దుస్తుల్లో ఆదిత్య బిర్లా వారి ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా గ‌ణ‌నీయ వాటానే పొందుతోంది. విదేశీ.. ప్ర‌త్యేకించి పాశ్చాత్య డ్రెస్‌ల ట్రెండ్‌కు కుర్రాళ్లు ప్రాధాన్యం ఇస్తున్నా.. దేశీయంగా సంప్ర‌దాయ దుస్తుల‌కు కూడా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది.

రిలయన్స్ అవంత్రా బ్రాండ్..
సంప్ర‌దాయ దుస్తులు, చీర‌ల ప‌ట్ల మ‌గువ‌ల‌కు ఉన్న మ‌క్కువ‌ను క్యాష్ చేసుకునేందుకు అవంత్రా బ్రాండ్ పేరిట రిల‌య‌న్స్ రిటైల్.. ప్రాంతీయ వీవ‌ర్ క్ల‌స్ట‌ర్లు, న‌ల్లి సిల్క్స్‌, పోథ్యీస్ వంటి ప‌లు థ‌ర్డ్ పార్టీ బ్రాండ్స్‌తో భాగ‌స్వామ్యంతో క‌స్ట‌మ‌ర్ల‌కు విభిన్న ర‌కాల చీర‌లు, దుస్తులు అందుబాటులోకి తెస్తోంది. జ్యువెలరీ, టైల‌రింగ్ సేవ‌లు కూడా ల‌భిస్తాయ‌ని రిల‌య‌న్స్ రిటైల్ వ‌ర్గాల క‌థ‌నం.

Rs 800 KG Bhindi : ఈ బెండ‌కాయ‌లు కిలో రూ.800.. ఎందుకంత కాస్ట్లీ అంటే

ఏపీ, కర్నాటకలో విస్త‌ర‌ణ‌కు ప్లాన్లు..
తొలుత బెంగ‌ళూరు కేంద్రంగా తొలి అవంత్రా.. చీర‌ల‌, సంప్ర‌దాయ దుస్తుల దుకాణాన్ని ప్రారంభించ‌నున్న‌ది రిల‌య‌న్స్ రిటైల్‌. అటుపై క‌ర్నాట‌క‌, ఏపీ మార్కెట్ల‌లో విస్త‌రించ‌నుంది.