Republic Day 2022: 73వ గణతంత్ర పరేడ్‌కు ముస్తాబైన రాజ్‌పథ్.. ఢిల్లీ పోలీసుల ఆంక్షలు ఇవే..!

దేశీయ 73గణతంత్ర దినోత్సవం వేడుకల కోసం ఢిల్లీ రాజ్ పథ్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

Republic Day 2022: 73వ గణతంత్ర పరేడ్‌కు ముస్తాబైన రాజ్‌పథ్.. ఢిల్లీ పోలీసుల ఆంక్షలు ఇవే..!

Republic Day 2022 Delhi Pol

Republic Day 2022: దేశీయ 73గణతంత్ర దినోత్సవం వేడుకల కోసం ఢిల్లీ రాజ్ పథ్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ ఆంక్షల రిపబ్లిక్ డే పరేడ్ నడుమ సాగనుంది. రాష్ట్రపతి భవన్,ఇండియా గేట్ పరిసరాలు శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నాయి. గణతంత్ర పరేడ్‌కు 27 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేయగా..  రిపబ్లిక్ డే పరేడ్ విధుల్లో 27,723 మంది పోలీస్ బలగాలు మోహరించాయి. దేశంలో కరోనా కేసుల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. అలాగే సామాజిక దూరాన్ని కూడా పాటించాలని సూచించారు.

రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు సైనిక కవాతులు, శకటాల ప్రదర్శన కొనసాగనుంది.  ఈసారి రిపబ్లిక్ పరేడ్‌లో 16 కవాతు విభాగాలు కనువిందు చేయనున్నాయి. సైనిక కవాతులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కేంద్ర సాయుధ బలగాలు, NCC, NSS విభాగాలు, 17 సైనిక బ్యాండ్‌లు పాల్గొననున్నాయి. మరో 25 కేంద్ర రాష్ట్రాల శకటాలు కూడా అలరించనున్నాయి.

75 ఏళ్ల ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈసారి ఫ్లై-పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్లై-పాస్ట్‌లో 75 విమానాలు వరకు పాల్గొననున్నాయి. ఫ్లై-పాస్ట్‌లో వింటేజ్‌, రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, MI-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి ఆధునిక విమానాలు కూడా గణతంత్ర పరేడ్‌లో కనువిందు చేయనున్నాయి. ఫ్లై-పాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా 15 వేర్వేరు రూపాల ప్రదర్శన కొనసాగనుంది.

ఉదయం 10:30కి ప్రారంభం..
బుధవారం (జనవరి 26) ఉదయం 10:30కి గణతంత్ర పరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి పరేడ్ చేసేందుకు వచ్చే వీక్షకులను అధికారులు గ్యాలరిల్లోకి అనుమతించనున్నారు.  15 ఏళ్ల లోపు పిల్లలకు, వ్యాక్సినేషన్ పూర్తి కాని వారికి పరెడ్ చూసేందుకు అనుమతి
లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.  పరేడ్ చూసేవారికి వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఉదయం 9 :15 నుంచి రిపబ్లిక్ పరేడ్ లైవ్ దూరదర్శన్ నుంచి టెలికాస్ట్ చేయనుంది. గణతంత్ర పరేడ్ చూపించేందుకు DD (దూరదర్శన్)
ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసింది.  రాష్ట్రపతి భవన్ నుంచి నేషనల్ స్టేడియం రెండు కిలోమీటర్ల పరిధిలో 59 కెమెరాలు ఏర్పాటు
చేశారు.

పరేడ్‌ను 160 మంది వీడియో జర్నలిస్టులు కవర్ చేయనున్నారు. రాజ్ పథ్‌లో 33, రాష్ట్రపతి భవన్‌లో 10, ఇండియా గేట్, నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ స్టేడియం వద్ద 16 కెమెరాలు ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల్లో పరేడ్,ఎయిర్ షో చూపించేందుకు రెండు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాజ్‌పథ్ ఒకటి, మరోకటి ఇండియా గేట్ పైన 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేశారు.  రాజ్‌పథ్, రాష్ట్రపతి భవన్‌లో పిటిజెడ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

గణతంత్ర వేడుకల్లో పాల్గొనేవారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. 15 ఏళ్ల లోపు పిల్లలను పరేడ్‌కు అనుమతి లేదని తేల్చిచెప్పారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు,753 మంది ఇన్స్పెక్టర్లు, 65 కంపెనీల సీఏపిఎఫ్ బలగాలు మోహరించాయి.  భద్రతా ఏర్పాట్లలో భాగంగా 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా 30 ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు అనుసంధానిస్తూ ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.  50 వేల మంది అనుమానిత క్రిమినల్స్ డేటా FRS డేటా బేస్ ఉందని తెలిపారు. ఢిల్లీలో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరేడ్‌కు కేవలం 24 వేల మందికి అనుమతించనున్నారు. 19 వేల మంది ఆహ్వానితులు ఉండగా.. 5 వేల మంది సాధారణ ప్రజానీకానికి అనుమతించనున్నారు.

Read Also : IAS Cadre Rules : కేంద్ర, రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనపై వివాదం