type-2 diabetes : టైప్‌-2 మధుమేహాన్ని 12 గంటల్లో అంచనా వేసే ఐఏ నమూనా

శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సాధారణ పరిస్థితి సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కవగా ఉంటాయి. అధిక దాహం, అతి మూత్ర విసర్జన, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారీ తీస్తుంది.

type-2 diabetes : టైప్‌-2 మధుమేహాన్ని 12 గంటల్లో అంచనా వేసే ఐఏ నమూనా

type-2 diabetes

type-2 diabetes : శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సాధారణ పరిస్థితి సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కవగా ఉంటాయి. అధిక దాహం, అతి మూత్ర విసర్జన, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారీ తీస్తుంది. మధుమేహం ఒక వ్యక్తిలో కళ్లు, గుండె, నరాలకు సంబంధించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ ను 12 గంటల్లో అంచనా వేయడం సాధారణంగా సాధ్యం కాదు. కానీ పరిశోధకులు కృత్రిమ మేధస్సుతో పని చేసే మోడల్ ను డెవలప్ చేశారు. టైప్ 2 డయాబెటిస్ ను 12 గంటల్లో అంచనా వేయడంలో ఈ మోడల్ దోహదపడుతుంది. ప్రీడయాబెటిస్, డయాబెటిస్ ను కచ్చితంగా నిర్ధారించడానికి నిరంతర గ్లూకోజ్ మానిటర్ల నుంచి రీడింగ్ లను ఉపయోగించవచ్చా లేదా అని శాస్త్రవేత్తలు పరిశోధించారు.

Diabetes In Children : పిల్లల్లో మధుమేహం లక్షణాలను గుర్తించటం ఎలా?

కేవలం 12 గంటల వ్యవధిలో గ్లూకోజ్ ప్రొఫైల్ డాటాలో టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్, బలహీనమైన గ్లూకోజ్ టాలరెన్స్ లేని వ్యక్తులను తెలుసుకునే వీలు కలుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా పర్యవేక్షణ, ముందస్తు స్క్రీనింగ్ లో ఉపయోగపడదు. అయితే మధుమేహం వచ్చే ప్రమాదం గురించి రోగిని హెచ్చరిస్తుందని క్లిక్ అప్లైడ్ సైన్సెస్ లోని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, ప్రధాన రచయిత జౌహ్యూన్ క్లేర్ జియోన్ తెలిపారు.