వలస విషాదాలు : రోడ్డు ప్రమాదాల్లో 12మంది వలస కూలీలు మృతి

  • Published By: nagamani ,Published On : May 19, 2020 / 05:21 AM IST
వలస విషాదాలు :  రోడ్డు ప్రమాదాల్లో 12మంది వలస కూలీలు మృతి

లాక్ డౌన్ సంకెళ్లనుంచి తప్పించుకుందామని..సొంత ఊర్లకు చేరుకుందామని గంపెడాశలతో పయనమైన వలస కూలీల బతుకులు స్వగ్రామాలకు చేరకుండానే తెల్లారిపోతున్నాయి. ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఇటీవల తరచు జరుగుతున్నాయి. అటువంటి మరో ప్రమాదం బీహార్ లో సంభవించింది.  

భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు – బస్సు ఢీకొనడంతో 9 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలు ట్రక్కులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 

ఈ క్రమంలోనే మంగళవారం (మే 19,2020) తెల్లవారుఝామున 3.30 గంటలకు  మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో వలస కూలీలు ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వలస కార్మికులతో సహా మరో బస్సు డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో 22మంది గాయపడ్డారు. కోల్వాన్ గ్రామంలో బస్సు సోలాపూర్ నుండి నాగ్పూర్ రైల్వే స్టేషన్కు వెళుతుండగా, జార్ఖండ్లోని తమ స్వస్థలాలకు చేరుకోవడానికి కార్మికులు ష్రామిక్ స్పెషల్ రైలులో ఎక్కటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ నూరుల్ హసన్ తెలిపారు.

పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో లాక్ డౌన్ తో పనులు లేక తల్లడిల్లిపోతున్నాయి. తినటానికి తిండి కూడా లేక కన్నబిడ్డల చిట్టి పొట్టల్ని కూడా నింపలేని దుస్థితిలో తమ స్వంత గ్రామాలకు వెళ్లిపోదామనే ఆశతో..కష్టాలకు..నష్టాలకు ఓర్చుకుంటూ కొంతమంది కాలి నడకన పోతుంటే..మరి కొందరు పలు వాహనాలపై బయలుదేరి దారి మధ్యలోనే ప్రమాదాలకు గురై ప్రాణాలో కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచు జరుగుతున్నాయి. 

Read: పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి : సహనం చచ్చిపోయిందేమో