Karnataka NEKRTC : కోవిడ్ కేంద్రాలుగా బస్సులు, కర్నాటక ఆర్టీసీ నిర్ణయం

కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాలకు వీటిని చేరవేస్తోంది.

Karnataka NEKRTC : కోవిడ్ కేంద్రాలుగా బస్సులు, కర్నాటక ఆర్టీసీ నిర్ణయం

Rtc

Mobile COVID Centres : భారతదేశంలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే.. వైరస్ కు చెక్ పెట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే..కొన్ని ఆసుపత్రుల్లో సరిపడా బెడ్స్ దొరకడం లేదు. దీంతో వారికి చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాలకు వీటిని చేరవేస్తోంది. ఈ బస్సు సర్వీసులు 24X7 అందుబాటులో ఉంటాయని, 2021, జూన్ 16వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించడం జరుగుతుందని రాజ్ కుమార్ పాటిల్ (Chairman, NEKRTC) వెల్లడించారు.

ఆసుపత్రులు, టీకా కేంద్రాలు లేని మారుమూల గ్రామాలకు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. కేవలం 24 గంటల్లో రెండు బస్సులను వ్యాక్సిన్ కేంద్రాలుగా మార్చివేయడం జరిగిందని, ఈ బస్సులో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. మరిన్ని బస్సులను కోవిడ్ కేంద్రాలుగా మార్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ కార్పొరేషన్ లో 88శాతం మంది కార్మికులు వ్యాక్సిన్ వేయించుకున్నారని వెల్లడించారు. కార్మికుల కుటుంబసభ్యులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని వారిని కోరుతున్నామన్నారు.

ఇక కర్నాటక రాష్ట్రంలో కరోనా విషయానికి వస్తే…2021, జూన్ 15వ తేదీ మంగళవారం 5 వేల 041 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. 115 మంది మృతి చెందారు. 14 వేల 785 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో 1,62,282 యాక్టివ్ కేసులున్నాయి.