మహారాష్ట్ర గవర్నర్ కు అవమానం..విమానంలో వెళ్లేందుకు అనుమతివ్వని ప్రభుత్వం

మహారాష్ట్ర గవర్నర్ కు అవమానం..విమానంలో వెళ్లేందుకు అనుమతివ్వని ప్రభుత్వం

Maharashtra మ‌హారాష్ట్రలో గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధ‌వ్ థాక్రే మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ముదురుతోంది. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అయినా కూడా కోషియారీకి ప్ర‌భుత్వ విమానంలో వెళ్లే అనుమ‌తి ఇవ్వ‌లేదు అక్క‌డి ప్ర‌భుత్వం. దీంతో రెండు గంటలపాటు ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేసిన గవర్నర్ కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం చివరికి ప్రైవేట్ విమానంలో డెహ్రాడూన్ కి వెళ్లారు.

అసలేం జరిగింది

తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్ వెళ్లేందుకుగాను ఇవాళ ఉదయం 10గంటలకు ముంబై ఎయిపోర్ట్ కి చేరుకున్నారు గవర్నర్. అయితే రాష్ట్ర ప్రభుత్వ విమానంలో గవర్నర్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ పర్మిషన్ కోసం రెండు గంట‌ల పాటు అక్క‌డే వేచి చూశారు గవర్నర్. సాధారణంగా పర్మిషన్ కోసం గవర్నర్ లు ఎదరుచూడరు. దీంతో గవర్నర్ విమానం ఎక్కి కూర్చున్న త‌ర్వాత కూడా 15 నిమిషాల పాటు వేచి చూశారు. అప్ప‌టికీ త‌న‌కు టేకాఫ్‌కు ఇంకా అనుమ‌తి రాలేద‌ని పైలెట్ చెప్ప‌డంతో కోషియారీ విమానం దిగిపోయారు. ఆ తర్వాత గవర్నర్ ఆఫీసు ఓ ప్రైవేటు విమానంలో ఆయనకు టిక్కెట్ బుక్ చేయడంతో..12:15గంటల సమయంలో ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రాడూన్ వెళ్లిపోయారు.

గవర్నర్ ఉత్తరాఖండ్ పర్యటన ఉంటుందని వారం క్రితమే ప్రభుత్వానికి తెలియజేశామని, అయినా సరే, ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని గవర్నర్ కార్యాలయ అధికారులు మండిపడ్డారు.ఈ ఉదంతంపై రాష్ట్ర పౌర విమానయాన విభాగం అధికారులు స్పందిస్తూ.. ఇందులో తమ జాప్యం లేదని పేర్కొన్నారు. విమానంలో ప్రయాణించడానికి ముఖ్యమంత్రి అనుమతి లాంఛనప్రాయం మాత్రమే.. అయినప్పటికీ, పలుసార్లు ప్రయత్నించినా సీఓఎం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సాధారణ విమానంలో వెళ్లిపోయారు అని ఓ అధికారి తెలిపారు.

ఇక ,ఈ ఉదంతంపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ‘ఇలా జరగడం దురదృష్టకరం. గవర్నర్ ఓ వ్యక్తి మాత్రమే కాదు. ఓ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఇదో చీకటి అధ్యాయం అని దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కాగా, గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రాష్ట్రంలో ప్రార్థ‌నాల‌యాల‌కు అనుమ‌తించిన‌ప్ప‌టి నుంచీ గ‌వ‌ర్న‌ర్‌, సీఎం మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. హిందుత్వ ఓట్ల కోసం చూసే ఉద్ధ‌వ్‌.. సెక్యుల‌ర్‌గా మారార‌ని అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ సెటైర్ వేశారు.
.