CM Arvind Kejriwal: ఆ దేశాల నుంచి విమానాలు ఆపకపోవడం విచారకరం

ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కనిపించిన వెంటనే వేరియంట్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి అంతర్జాతీయ విమానాలను ఆపేయాలంటూ కేజ్రీవాల్ వెల్లడించారు.

CM Arvind Kejriwal: ఆ దేశాల నుంచి విమానాలు ఆపకపోవడం విచారకరం

Kejriwal

CM Arvind Kejriwal: ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కనిపించిన వెంటనే వేరియంట్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి అంతర్జాతీయ విమానాలను ఆపేయాలంటూ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం గురువారం మాట్లాడుతూ.. కేంద్రానికి విన్నవించినప్పటికీ వాటిని ఆపలేకపోవడం విచారకరమని అన్నారు.

ప్రధాని మోదీని కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి విమాన రాకపోకలు వెంటనే ఆపేయాలంటూ ఆదివారం లేఖ ద్వారా తెలిపారు. అప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. బెంగళూరులోని దక్షిణాఫ్రికాకు చెందిన 66ఏళ్ల వృద్ధురాలు నవంబర్ 20న ఇండియాకు వచ్చింది. మరో వ్యక్తి బెంగళూరులో మత్తు మందు ఇచ్చే 46ఏళ్ల డాక్టర్. అతను దక్షిణాఫ్రికాకు వెళ్లినట్లు ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం.

వారికి సంబంధించిన వార్తలను ట్యాగ్ చేసిన సీఎం కేజ్రీవాల్.. గురువారం ఇలా ట్వీట్ చేశారు. కరోనా ప్రభావం ఎదుర్కొన్న దేశాల నుంచి విమానాలను ఆపలేకపోవడం విచారకరం. అని అందులో రాశారు.

……………………………………………. : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?

మోదీకి రాసిన లెటర్ లో ఇలా ఉంది. “మన దేశం ఏడాదిన్నరగా కరోనాతో పోరాడి చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. సమస్యలను ఎదుర్కొంటూ నిస్వార్థమైన సేవలు అందించి లక్షల మంది కొవిడ్ వారియర్స్ వల్ల.. ఎలాగైతే మనం కరోనావైరస్ నుంచి బయటపడగలిగాం’ అని అందులో పేర్కొన్నారు.

కరోనా వైరస్ కొత్త వేరియంట్ కారణంగా యూరోపియన్ యూనియన్ లోని పలు దేశాలు బాగా దెబ్బతిన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని కేజ్రీవాల్ సూచించారు. విమనాలను ఆపేయడంతో పాటు పూర్తి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని ఆక్సిజన్ ప్రొడక్షన్, స్టోరేజ్ ఫెసిలిటీస్, బెడ్స్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

………………………………….: ఒరిజినల్స్‌కు ఊపిరాడకుండా చేస్తున్న వెబ్ సిరీస్‌లు!