Electricity Charges : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?

కరెంట్‌ బిల్లుల పెంపుతో షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం అనుమతించడమే తరువాయి...

Electricity Charges : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?

Tg Current

Updated On : December 3, 2021 / 6:31 AM IST

Telangana Electricity Charges : తెలంగాణలో విద్యుత్‌ చార్జీల వడ్డనకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు విద్యుత్‌ శాఖ సైతం వినియోగదారులపై ధరల వడ్డనకు రెడీ అయ్యింది.  కరెంట్‌ బిల్లుల పెంపుతో షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం అనుమతించడమే తరువాయి… చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి పెరగకుండా ఉన్న ప్రాథమిక చార్జీలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌టి వన్‌ ఏ కేటగిరీలో 50యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగిస్తే.. యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున ప్రస్తుతం వసూలు చేస్తున్నారు.

Read More : Jubilee Hills : మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం..అనంతరం బ్లాక్ మెయిల్

మొదటి నుంచి కూడా ఈ చార్జీల్లో మార్పులేదు. అయితే ఈ సారి స్వల్ప పెంపు తప్పకపోవచ్చు.  రూపాయి 45 పైసలుగా ఉన్న యూనిట్‌ ధరను.. రూపాయిన్నర చేసే అవకాశముంది. అంటే యూనిట్‌పై ఐదు పైసలు పెరిగనుంది. నెల బిల్లులో కేవలం మూడు రూపాయలు మాత్రమే పెరుగుతుంది. ఇది పెద్ద భారమే కాదన్న యోచనలో ఉన్నారు అధికారులు. స్లాబుల్లో మార్పుతో, డిమాండ్‌ చార్జీల పెంపుతో పరోక్ష ఆదాయం పెరగవచ్చని డిస్కమ్స్‌ భావిస్తున్నాయి. విద్యుత్‌ డిస్కంలు మరింత నష్టాల ఊబిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ సారి చార్జీల పెంపు తధ్యంగా కనిపిస్తోంది. దేశంలో కరెంట్‌ సరఫరాలో రాష్ట్రాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా… తెలంగాణ మాత్రం విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Covid Positive : సూర్యాపేట DMHO కుటుంబంలో ఆరుగురికి కరోనా

రానున్న రోజుల్లో తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే వడ్డన తప్పనిసరి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే పారిశ్రామిక విద్యుత్‌ చార్జీలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏపీ చార్జీలకు సమానంగా ఉండేలా పారిశ్రామిక చార్జీలు తగ్గించే అవకాశముంది. దీనికి తోడు డిస్కంల అప్పులను ఉదయ్‌ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతానికి డిస్కంటలకు అధిక వడ్డీల భారం దాదాపుగా తప్పిందనే చెప్పుకోవాలి. విద్యుత్‌ లభ్యత పెరిగింది. అంతేకాదు… విద్యుత్‌ సరఫరా పెరగడంతో డిస్కంల విద్యుత్‌ వ్యాపారం బాగా కలిసివస్తోంది. కానీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు సబ్సిడీలు సకాలంలో అందజేయడం లేదని సమాచారం. మరి తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా ? పెరిగితే ఎంత అనేది రానున్న రోజుల్లో చూడాలి.