Sahdev Dirdo : స్కూల్ పిల్లాడి పాటకు సీఎం ఫిదా…

ఓ స్కూల్ పిల్లాడు టీచర్ కోసం సరదాగా పాడిన పాటతో నార్త్ ఇండియాలో స్టార్ అయిపోయాడు. రాష్ట్ర సీఎం కూడా ఆ పిల్లాడి పాటకు ఫిదా అయిపోయారు. స్వయంగా పిలిపించుకుని మరీ ఘనంగా సన్మానించారు.

Sahdev Dirdo : స్కూల్ పిల్లాడి పాటకు సీఎం ఫిదా…

Sahdev Dirdo Song

Viral Kid Sahdev Dirdo: సోషల్‌ మీడియా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తోంది. మారుమూలల్లోని టాలెంట్ చూపించుకోవటానికి సోషల్ మీడియా వేదికగా మారింది. ఎవరూ అవకాశం ఇవ్వక్కర్లా. ఉన్నది ఒకటే దారి. అదే సోషల్ మీడియా. అలా ఓ పిల్లాడు సరదాగా పాడిన పాటతో నార్త్ ఇండియాలో ఫేమస్ అయిపోయాడు. ‘ జానే మేరీ జానేమన్‌.. బస్‌పన్‌ క్యా ప్యార్‌ మేరా..’ అంటూ ఛత్తీస్ గడ్ పిల్లాడు పాడిన పాటకు సీఎం కూడా ఫిదా అయిపోయాడు.స్వయంగా పిలిపించుకుని ఘనంగా సన్మానించారు సీఎం భూపేష్ బాఘేల్. ఆ పిల్లాడి పేరు సహదేవ్ డిర్దో. వయస్సు 14 ఏళ్లు.

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్‌ డిర్దో నార్త్‌ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్‌ స్టార్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ పిల్లాడి పాటకు రీమిక్స్‌తోడై సోషల్‌ మీడియాని ఊపేస్తోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్‌సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గొంతుకు ఫిదా అయిపోతున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు సైతం ఈ పాటను తెగ వాడేసుకుంటున్నాయి.రెండేళ్ల క్రితం పాడిన ఆ పాట వైరల్‌ అవ్వటం కూడా ఓ వైరల్ అనేచెప్పాలి.

కమలేష్‌ బారోత్‌ అనే ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ సింగర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌ కంపోజ్‌ చేసిన ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ సాంగ్‌ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్‌ అయ్యింది. ఉత్తరాదిలో రూరల్ జనాలకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆ టైంలో స్కూల్‌లో సహదేవ్ డిర్దో తన టీచర్‌ కోసం ‘బచ్‌(స్‌)పన్‌ క్యా ప్యార్‌’ అంటూ పాడాడు.అప్పటికే సహదేవ్ 7th క్లాస్ చదువుతున్నాడు.

ఆ పాట ఆ టీచర్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ పిల్లాడి గొంతుకు ఫిదా అయిపోయారు. దాన్ని ఫోన్‌లో రికార్డు చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసారు. కానీ అది వైరల్‌ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. ఆ పాట అలా అలా ర్యాపర్‌ బాద్‌షా చెవిలో పడింది. అంతే దాని రూపే మారిపోయింది. దాన్నీ రీమిక్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ వదిలాడు. అంతే ఇక చూసుకోవాలి. వైరల్ మామూలుగా అవ్వలేదు.ఎవరి నోట విన్నా ఇదే పాట. దీంతో ఆ చక్కటి గొంతు ఎవరిదా? అని తెలుసుకోవటం జనాలు బిజీ అయిపోయారు. చివరికి మీడియా హౌజ్‌ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్‌ వెలుగులోకి వచ్చాడు. సరదాగా టీచర్ కోసం పాడిన పాటతో సహదేవ్ ఇప్పుడు నార్త్ ఇండియాని షేక్ చేస్తున్నాడు.