PM Modi : బాలికలకు గుడ్ న్యూస్, ఇక సైనిక్ స్కూళ్లలో ఎంట్రీ

ఎర్రకోటపై నుంచి ప్రధాన నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఓ కీలక ప్రకటన చేశారు.

PM Modi : బాలికలకు గుడ్ న్యూస్, ఇక సైనిక్ స్కూళ్లలో ఎంట్రీ

Modi1

Sainik Schools : భారతదేశ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. 75 స్వాతంత్రయ దినోత్సవం సందర్భంగా…ఎర్రకోటపై నుంచి ప్రధాన నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో బాలికలకు ఎంట్రీ ఉంటుందని వెల్లడించారు. దీనికి గల కారణం ఆయన తెలిపారు. ఈ విషయంలో చాలా మంది బాలికలు తనకు లేఖలు రాస్తున్నారని, అందుకే బాలికల కోసం అన్ని సైనిక్ స్కూళ్ల తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.

Read More : Allu Arha : అల్లు అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..!

రెండున్నరేళ్ల కిందట తొలిసారి మిజోరాం సైనిక్ స్కూల్ లో బాలికలను అనుమతించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయన్నారు. కూతుళ్ల కోసం సైనిక్ స్కూళ్లు తలుపులు తెరుస్తాయన్నారు మోదీ. రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఈ సైనిక్ స్కూళ్లు ఉంటాయి. చిన్నతనం నుంచే భారత సాయుధ బలగాల వైపు విద్యార్థులను ప్రోత్సాహించే ఉద్ధేశ్యంతో ఈ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.

Read More :Big Boss 5: బిగ్‌బాస్‌ను రిజెక్ట్ చేసిన వర్షిణి, మంగ్లీ.. కారణమేంటో?

దేశ వ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బాలురతో పాటు బాలికలకూ ప్రవేశం కల్పించాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మిజోరాంలోని ఓ సైనిక్ పాఠశాలలో 2018-19లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రవేశాల ప్రక్రియ విజయవంతం కావడంతో…దేశంలో మొత్తం 33 బడుల్లోనూ ఇలాగే చేయాలని నిర్ణయించింది. ఆదివారం రాజ్ ఘాట్ దగ్గర మహాత్మాగాంధీ సమాధానికి మోదీ నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు వెళ్లారు. అక్కడ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతరులు మోదీకి స్వాగతం పలికారు. త్రివిధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా…ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొన్న 32 మంది అథ్లెట్లు పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.