Fixed Deposits : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్

ఐదేండ్ల కాల‌ప‌రిమితి క‌లిగిన ఎఫ్‌డీల‌పై 5.45 శాతం వ‌డ్డీరేటు అమ‌ల్లో ఉంది. ఇక ఆర్‌బీఐ రెపో రేటును పెంచ‌డంతో రుణాల‌పై వ‌డ్డీరేట్లు అధికం కావ‌డంతో క‌స్ట‌మ‌ర్ల‌పై ఈఎంఐల భారం పెర‌గ‌నుంది.

Fixed Deposits : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్

Sbi

SBI interest rates : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వ‌డ్డీ రేట్లు పెంచేందుకు ఎస్‌బీఐ స‌న్న‌ద్ధ‌మైంది. ఆర్‌బీఐ బుధ‌వారం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన క్ర‌మంలో రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌తో పాటు ఎఫ్‌డీల‌పైనా వ‌డ్డీ రేట్ల పెంపుకు బ్యాంకులు క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి.

ఎఫ్‌డీల‌పై వడ్డీరేట్లు పెరుగుతాయ‌ని ఎస్‌బీఐ చైర్మ‌న్ దినేష్ కుమార్ ఖ‌రా పేర్కొన్నారు. నూత‌న ఎఫ్‌డీల‌పై తాజా వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయ‌ని, ఇప్ప‌టికే వివిధ కాల‌ప‌రిమితి క‌లిగిన డిపాజిట్ల‌పై తాము వ‌డ్డీరేట్ల‌ను పెంచామ‌ని ఎస్‌బీఐ చీఫ్ చెప్పారు. ప్ర‌స్తుతం ఏడాది నుంచి రెండేండ్ల కాల‌ప‌రిమితి క‌లిగిన ఎఫ్‌డీల‌పై ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు 5.10 శాతం చొప్పున వ‌డ్డీ ల‌భిస్తోంది.

SBI Jobs: ఎస్బీఐలో 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఐదేండ్ల కాల‌ప‌రిమితి క‌లిగిన ఎఫ్‌డీల‌పై 5.45 శాతం వ‌డ్డీరేటు అమ‌ల్లో ఉంది. ఇక ఆర్‌బీఐ రెపో రేటును పెంచ‌డంతో రుణాల‌పై వ‌డ్డీరేట్లు అధికం కావ‌డంతో క‌స్ట‌మ‌ర్ల‌పై ఈఎంఐల భారం పెర‌గ‌నుంది. రెపో రేటుకు అనుగుణంగా రుణాల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని దినేష్ కుమార్ వెల్లడించారు.